Youtube :యూట్యూబ్ మాజీ సీఈఓ సుసాన్ వోజ్ కికీ కన్నుమూత

Fomer Youtube CEO :యూట్యూబ్ మాజీ సీఈఓ సుసాన్ వోజ్ కికీ కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె మరణించారు. సుసాన్ వోజ్ కికీ మరణవార్తను భర్త డెన్నిస్ ట్రోపర్ ఫేస్ బుక్ వేదికగా వెల్లడించారు.

అనంతరం సుసాన్ వోజ్ కికీ మరణవార్తను గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పంచుకున్నారు. సుసాన్ వంటి మంచి స్నేహితురాలిని కోల్పోవడం ఎంతో బాధను కలిగిస్తుందని పేర్కొన్నారు. ఆమె లేరన్న విషయాన్ని ఊహించుకోవడం కూడా కష్టంగా ఉందని తెలిపారు.