ఐఎస్ఐ (ISI) మాజీ చీఫ్ ఫైజ్ హమీద్ అరెస్ట్ అయ్యారని పాకిస్తాన్ సైన్యం తెలిపింది. హౌసింగ్ స్కీమ్( Housing sceam )కుంభకోణానికి సంబంధించి ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) మాజీ చీఫ్ హమీద్ ను పాకిస్తాన్ మిలిటరీ (Pakistan Military ) అదుపులోకి తీసుకొంది. అలాగే అతనిపై కోర్టు మార్షల్ ప్రక్రియ ప్రారంభించిందని సైన్యం తెలిపింది. అయితే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పై మార్షల్ ప్రారంభించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్ పై దాఖలు చేసిన ఫిర్యాదులోని కచ్చితత్వాన్ని నిర్ధారించడానికి సుప్రీం కోర్టు(Supreme Court) ఆదేశాలకు అనుగుణంగా పాకిస్తాన్ సైన్యం విచారణ చేపట్టింది. ఈ మేరకు ఫీల్డ్ జనరల్ కోర్టు మార్షల్ ప్రక్రియ ప్రారంభించిందని, హమీద్ ను మిలిటరీ కస్టడీలోకి తీసుకొన్నారని వెల్లడించారు. ఈ కారణంగా పాక్ ఆర్మీ చట్టం (Pakistan Army Act) నిబంధనల ప్రకారం హమీద్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకొంటారని ప్రకటనలో తెలిపారు.