Richest Village: ఆసియాలోని అత్యంత సంపన్న గ్రామం.. ఎక్కడో తెలిస్తే షాక్ కావాల్సిందే..!!

ఒకప్పుడు గ్రామం (Village) అంటే బురదమయమైన రోడ్డు, చేతిపంపులు, మట్టి ఇళ్లు, పంట పొలాలు వంటివి గుర్తుకు వస్తాయి. ప్రస్తుతం మారుతున్న కాలంతో పాటు గ్రామాలు కూడా అభివృద్ధి (Development) పథంలో దూసుకెళ్తున్నాయి. ఆయా ప్రభుత్వాలు అందిస్తున్న సహకారంతో గ్రామాలు సుభిక్షంగా మారుతున్నాయనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఆసియాలోనే అత్యంత సంపన్న గ్రామం (Richest Village) ఏంటి? ఎక్కడ ఉంది? అనేది తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు.

జపాన్, చైనా వంటి దేశాల్లో ఉందేమోనని ఆలోచిస్తున్నారా? కానీ కాదు.. ఆ గ్రామం మన భారత్ లోనే ఉంది. అవునండి. మీరు వింటున్నది నిజమే. గుజరాత్ (Gujarat) రాష్ట్రంలోని భుజ్ లో ఉన్న మాదాపూర్ (Madhapur) అనే గ్రామం. యావత్ ఆసియా (Asia) లోనే అత్యంత ధనిక గ్రామంగా పేరుగాంచింది. ఈ గ్రామంలో సుమారు 32 వేల మంది ప్రజలు నివసిస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఇక్కడి ప్రజలు సుమారు రూ.7 వేల కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్ల( Fixed Deposits) ను కలిగి ఉండటం విశేషం.

మాదాపూర్ గ్రామంలోని సుమారు 20 వేలకు పైగా ఇళ్లు పటేల్ కమ్యూనిటీ (Patel Community) కి చెందినవని తెలుస్తోంది. అంతేకాదు ఈ గ్రామాభివృద్ధి (Village Development) కి 65 శాతం ఎన్ఆర్ఐ (నాన్ రెసిడెంట్ ఇండియన్) లు ప్రతి ఏడాది కోట్లాది రూపాయలను స్థానిక బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల్లో డిపాజిట్లు చేస్తుండగా.. వాటిని వారి కుటుంబ సభ్యుల నుంచి స్వీకరిస్తారని సమాచారం. మరోవైపు ఈ గ్రామంలో ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, పీఎన్బీ, హెడీఎఫ్సీ, ఐసీఐసీఐ వంటి ప్రధాన బ్యాంకులు సహా మొత్తం 17 బ్యాంకులు (Banks) ఉన్నాయని సమాచారం.