మాలీవుడ్(Mollywood) లో ప్రస్తుతం జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ (Hema Commission Report) తీవ్ర కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నివేదికపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోండగా.. దక్షిణాది సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ (Radhika Sarath Kumar) ఓ ఇంటర్ల్వూలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
మలయాళ చిత్ర పరిశ్రమ (Cine Industry) లోనే కాకుండా అన్ని ఇండస్ట్రీల్లో లైంగిక వేధింపులు (Sexual harassment) ఉన్నాయని రాధికా శరత్ కుమార్ అన్నారు.నటీ మణులు దుస్తులు మార్చుకునే సినిమా సెట్ ల సమీపంలోని కారవాన్ల(caravans)లో సీక్రెట్ కెమెరాలు పెట్టేవారని ఆరోపించారు. ఈ విధంగా కారవాన్లలో సీక్రెట్ కెమెరాలు (Secret Cameras) బయటపడిన తరువాత తాను ఆ సౌకర్యాన్ని ఉపయోగించుకోలేదని చెప్పారు. ఒకవేళ దుస్తులు మార్చుకోవాల్సి వస్తే తాను బస చేసే హోటల్ గదికి వెళ్లి తిరిగి వచ్చే దానినని తెలిపారు. ప్రముఖ వ్యక్తులు తమ హోటల్ గదుల (Hotel Rooms) కు వచ్చి తలుపులు ఎలా కొడతారో తనకు చెప్పారన్న ఆమె మలయాళ చిత్ర పరిశ్రమలో పని చేస్తున్న పలువురు మహిళా నటులలో కొందరు తన సహాయం కూడా కోరారని ఆమె తెలిపారు. అయితే దేశవ్యాప్తంగా హేమ కమిటీ రిపోర్టుపై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.