New Friendship : రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ, శత్రువులు కానీ ఉండరని చెబుతుంటారు. తాజాగా బచ్చన్, గాంధీల మధ్య స్నేహమే ఉదాహరణ (Example) గా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా కాంగ్రెస్ ఎంపీ సోనియా గాంధీ ( Congress MP Sonia Gandhi), సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ (MP Jaya Bachchan) ల మధ్య కొత్త స్నేహం ఏర్పడిన సంగతి తెలిసిందే.
పార్టీలు వేరైనప్పటికీ గాంధీ కుటుంబం, బచ్చన్ కుటుంబం మధ్య ఒకప్పుడు మంచి అనుబంధమే ఉండేది. ఆ తరువాత పరిస్థితుల్లో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. రెండు కుటుంబాల ( Two Families) మధ్య సంబంధాలు తగ్గాయి. అంతేకాదు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ, మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చాలా సన్నిహితంగా ఉండేవారు. రాజీవ్ గాంధీ కోరిక మేరకు అమితాబ్ బచ్చన్ 1984 సంవత్సరంలో అలహాబాద్ నుంచి లోక్ సభకు పోటీ చేసి విజయం సాధించారు. అయితే బోఫోర్స్ కుంభకోణం ( B-Force Scam)లో అమితాబ్ పేరు తెరపైకి రావడంతో ఆయన లోక్ సభకు రాజీనామా చేశారు. అప్పటి నుంచే రాజీవ్ గాంధీ ఆయనతో మాట్లాడటం మానేశారని, ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు తగ్గిపోయాయని చెబుతుంటారు.
ఇటీవల సోనియా గాంధీ, జయాబచ్చన్ ఆప్యాయంగా పలకరించుకోవడం చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. అంతేకాదు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ కర్, ఎంపీ జయాబచ్చన్ కు వాగ్వాదం నెలకొంది. ఆ సమయంలో ఎంపీ జయాబచ్చన్ కు సోనియా గాంధీ అండగా నిలిచారు. దీంతో వీరి మధ్య మరోసారి స్నేహబంధం చిగురించింది.