Ration Card: రేషన్ కార్డు ఉన్న వారికి ఉచితంగా మరో 9 సరుకులు..!!

ఆహార భద్రత కోసం లబ్ధిదారులకు ప్రభుత్వాలు (Governments) ఉచితంగా రేషన్ బియ్యాన్ని( Ration Rice) అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్రం ప్రజలకు శుభవార్త చెప్పింది.

దేశంలో ఉన్న నిరుపేదలకు ప్రభుత్వ ఉచిత రేషన్ పథకం కింద రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. ఇప్పుడు రేషన్ కార్డు దారులకు తొమ్మిది నిత్యావసర సరుకులను కూడా ఉచితం(Free)గా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. వీటిలో పప్పులు, ధాన్యాలు, చక్కెర, గోధుమలు, ఉప్పు, నూనె, పిండి, సోయాబీన్ మరియు మసాలా దినుసులు ఉంటాయని సమాచారం. ఉచితంగా బియ్యానికి బదులుగా ఇకపై ఈ సరుకులు అందిస్తారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పేద ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం (Key Decision)తీసుకుందని తెలుస్తోంది. కానీ దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.