Raj Pakala: జ‌న్వాడ ఫామ్ హౌస్ కేసులో కీల‌క ప‌రిణామం.. విచార‌ణ‌కు హాజ‌రైన రాజ్ పాకాల‌

జ‌న్వాడ ఫామ్ హౌస్ కేసు కేసులో మాజీ మంత్రి, బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావ‌మ‌రిది రాజ్ పాకాల మోకిల పోలీసుల ఎదుట విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. త‌న న్యాయ‌వాదితో పాటు ఆయ‌న విచార‌ణ‌కు వ‌చ్చారు. ఇటీవ‌ల పోలీసులు ఆయ‌న‌కు పార్టీ కేసుకు సంబంధించి విచారించాల‌ని నోటీసులు ఇచ్చిన విష‌యం తెలిసిందే. జ‌న్వాడ‌లోని రిజ‌ర్వ్ కాల‌నీలోని త‌న‌ ఫామ్‌హౌస్‌లో రాజ్ పాకాల శ‌నివారం రాత్రి పార్టీ నిర్వ‌హించారు. అయితే, పెద్ద శ‌బ్దాల‌తో ఈవెంట్ నిర్వ‌హిస్తున్న‌ట్లు స‌మాచారం మేర‌కు పోలీసులు ఫామ్‌హౌస్‌కు చేరుకుని సోదాలు నిర్వ‌హించారు.

ఆ స‌మ‌యంలో 21 మంది పురుషులు, 14 మంది మ‌హిళ‌ల‌ను అదుపులోకి తీసుకున్నారు. 35 మందితో నిర్వాహ‌కులు మ‌ద్యం పార్టీ నిర్వ‌హించారు. దాంతో పోలీసులు డ్ర‌గ్స్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఆ ప‌రీక్ష‌ల్లో రాజ్ పాకాల స్నేహితుడు విజ‌య్ మ‌ద్దూరి కొకైన్ తీసుకున్న‌ట్లు తేలింది. ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు న‌మోదు చేశారు. ఈ కేసు విచార‌ణ‌లో భాగంగానే రాజ్ పాకాల‌కు పోలీసులు నోటీసులు ఇవ్వ‌డంతో ఈరోజు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు.