తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో అత్యంత కీలక భూమిక పోషించిన కె చంద్రశేఖర్ రావ్ (kcr ) రాజకీయంగా ఉనికి కోల్పోబోతున్నారు . ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న కుమార్తె కవితను బయటకు తీసుకువచ్చేందుకు శక్తి , యుక్తులన్నీ ఉపయోగించి . . సక్సెస్ కాలేకపోయినా కేసిఆర్ . . ఇక ఆఖరి అస్త్రంగా భారతీయ రాష్ట్ర సమితి *(బీఆర్ఎస్ ) ను బీజేపీలో కలిపేసేందుకు సిద్దపడిపోయారు .
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా (Telangana First CM ) అధికార పీఠం చేపట్టిన కెసిఆర్ .. రెండు దఫాలు సీఎం పీఠం అధిరోహించారు . తెలంగాణకు దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రతినబూని . . చేయకపోతే పీక కోసుకుంటానని శపధం చేసిన కేసిఆర్ . . తెలంగాన దళితులను వంచించి తానే రెండు దఫాలు సీఎం అయ్యారు . ఇదిలా ఉంచితే . . సీఎంగా ఉన్నపుడు కేసీఆర్ . . అధికార మదంతో విర్రవీగిపోయారు . పొరుగు రాష్ట్రంలో జగన్ సీఎంగా ఉన్నపుడు అతని అక్రమాలు , అరాచకాలను సైతం ప్రోత్సహించి . . చంద్రబాబుపై కారు కుట్రలు కూసిన కేసీఆర్ . . ఇపుడు ఏంచేయాలో పాలుపోని రాజకీయ దుస్థితికి చేరుకున్నారు.
త్వరలో విలీనం . . బిఆర్ఎస్ ను త్వరలో బీజేపీలో విలీనం చేసేందుకు కేసిఆర్ ఇప్పటికే బీజేపీ పెద్దలతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది . ఇతను ప్రత్యక్షంగా ఢిల్లీ వెళ్లి బీజేపీ , ఆర్ఎస్ఎస్ పెద్దలతో సంప్రదింపులు జరపకపోయినా . . తనయుడు కెటిఆర్ , మేనల్లుడు హరీష్ రావు మూడు దఫాలు బీజేపీ పెద్దలతో జరిపిన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి . అక్టోబర్ నెలలో బీజేపీలో BRS విలీన ప్రక్రియ పూర్తివుతుందని చెపుతున్నారు . మోడీపై సైతం కారుకూతలు కూసిన కెసిఆర్ . . 2018 ఎన్నికలలో ఓటమిపాలైన , , ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికలలో జగన్ గెలుస్తున్నదంటూ మరోసారి తన మనసులో మాట బయటపెట్టి జనంలో చులకనైపోయారు . తెలంగాణ సమాజంలో సైతం చీదరించుకునే పరిస్థితి తెచ్చుకున్నారు . బిఆర్ఎస్ లో ఇతర నాయకులకు పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు ఇష్టం లేకపోయినా . . కుమార్తె కవితను మద్యం కుంభకోణం నుంచి బయటకు తెచ్చుకునేందుకు కేసీఆర్ విలీనంపై ముందుకుపోతున్నారు .