Jani Master Bail: మధ్యంతర బెయిల్ తీసుకోబోనంటూ జానీ మాస్టర్ మెమో దాఖలు

నార్సింగి: పోక్సో చట్టం (POCSO Act) కింద కేసు నమోదైన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్,(Johny Master) రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణ బుధవారానికి వాయిదా పడింది.

ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జానీ మాస్టర్కు జాతీయ అవార్డు (National Award) తీసుకునేందుకు ఈనెల 6 నుంచి 9 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. కానీ అవార్డు రద్దు కావడంతో మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని పోలీసుల పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు అవార్డు రద్దు కావడంతో మధ్యంతర బెయిల్ తీసుకోబోనంటూ జానీ మాస్టర్ కూడా కోర్టులో మెమో దాఖలు (Memo) చేశారు. దీంతో నార్సింగి పోలీసులు తమ పిటిషన్ ను వెనక్కి తీసుకున్నారు.