గ్రూప్-2 పరీక్షలకు సర్వం సిద్ధం..

  • రేపు, ఎల్లుండి గ్రూప్ -2 పరీక్షల నిర్వహణ
  • ఏర్పాట్లు పూర్తయ్యాయన్న టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం
  • సుమారు 5.51 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యే ఛాన్స్

తెలంగాణలో గ్రూప్ -2 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రేపు, ఎల్లుండి జరిగే ఈ పరీక్షలు పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం అన్నారు. ఈ క్రమంలో అభ్యర్థులు ఎలాంటి అనుమానాలు, అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. అదేవిధంగా మెరిట్ ప్రకారమే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు.

ఈ సారి త్వరగానే ఫలితాలు విడుదల చేస్తామని బుర్రా వెంకటేశం తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని అంశాలను సమీక్షించామన్నారు. ప్రశ్నాపత్రాలకు 58 చోట్ల స్టోరేజ్ పాయింట్లు పెట్టామన్న ఆయన అభ్యర్థికి తప్ప ప్రశ్నాపత్రం ఎవరికీ తెలిసే అవకాశం లేదని చెప్పారు. ఈ సారి సుమారు 5.51 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని వెల్లడించారు.