- సీఎం, మంత్రుల పర్యటనల వలన ప్రయోజనం లేదు..
- ఢిల్లీ, జైల్ టూరిజాల్లో ప్రగతి సాధించారంటూ విమర్శ
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. ట్విట్టర్ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల ఢిల్లీ పర్యటనల వలన రాష్ట్రానికి రూపాయి కూడా ప్రయోజనం లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ సర్కార్ ఢిల్లీ టూరిజం మరియు జైల్ టూరిజంలో ఎంతో ప్రగతి సాధించిందంటూ ఎద్దేవా చేశారు. జైలు టూరిజంలో భాగంగా సుమారు 40 మంది రైతులను జైలుకు పంపారని ఆరోపించారు. సినీ నటులను సైతం జైలుకు పంపారన్న ఆయన బెయిల్ వచ్చినా విడుదల చేయలేదని విమర్శించారు.