Rushikonda: రిషికొండపై చర్చ

గత వైసీపీ ప్రభుత్వం హయాంలో విశాఖలో రాజధాని ఏర్పాటులో భాగంగా రుషికొండపై నిర్మించిన భవనంపై శాసనసభలో మంగళవారం చర్చ చేపట్టనున్నారు. ఈ ప్యాలెస్ కోసం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారనే దానిపై పలువురు సభ్యులు ఇప్పటికే సభలో ప్రశ్నలు అడిగారు. దీనికి తోడు సోమవారం సభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ.. టిక్నో గృహాలపై శాసనసభలో నిర్వహించిన చర్చకు మంచి ఫీడ్ బ్యాక్ వచ్చిందన్నారు. అలాగే రుషికొండ, ఇసుక, మద్యం విక్రయాల్లో జరిగిన కుంభకోణం పైన స్వల్ప … Read more

Vizag Steel Plant: వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో భారీ ప్రమాదం.. రూ.300 కోట్ల బుగ్గిపాలు

విశాఖపట్టణంలో ఈ నెల మూడో తేదీన భారీ అగ్నిప్రమాదం సంభవించి దాదాపు రూ. 300 కోట్లు నష్టం వాటిల్లిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. విద్యుత్తు కేబుళ్లలో షార్ట్ సర్క్యూట్ కారణంగా స్టీల్ మెల్టింగ్ షాప్ (ఎస్ఎంఎస్)-2లో మంటలు చెలరేగాయి. వాటిని సకాలంలో అదుపు చేయలేకపోవడంతో భారీ నష్టం వాటిల్లింది. అవగాహన లేకుండా తాళాలు వేయాల్సిన చోట వెల్డింగ్ చేయడంతో అవి తెరవడానికి కుదరకపోవడంతో అత్యంత శక్తిమంతమైన కేబుళ్లు కాలిపోయాయి. వాటిని పునరుద్ధరించాలంటే మొదటి నుంచీ మళ్లీ … Read more

Visakhapatnam: విజయవాడ – విశాఖ మధ్య మరో రెండు విమాన సర్వీసులు

విశాఖపట్నం నుంచి విజయవాడ మధ్య విమాన ప్రయాణాలు చేసేవారికి అనుకూలంగా కొత్తగా రెండు విమాన సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం విశాఖ – విజయవాడ మధ్య ఒక్క సర్వీసు మాత్రమే రాకపోకలు సాగిస్తుండటంతో సరిపోవడంలేదు. అందుకే  కొత్తగా రెండు విమాన సర్వీసులను అందుబాటులోకి వస్తున్నాయని విశాఖ విమానాశ్రయం డైరెక్టర్ రాజారెడ్డి శనివారం  తెలిపారు. ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థల విమాన సర్వీసులను ఈరోజు (ఆదివారం) … Read more

HudHud Cyclone : విశాఖలో హుద్‌‌హుద్‌ తుపాను బీభత్సానికి పదేళ్లు..

విశాఖపట్నం.. ఓవైపు సముద్రతీరం.. మరోవైపు పచ్చని చెట్లతో అత్యంత ఆహ్లాదకరంగా ఉండేది. అలాంటి సిటీపై హుద్ హుద్ తుపాను విరుచుకుపడింది. నగరమంతా కకావికలమైంది. ఎక్కడ చూసినా కన్నీళ్లు పెట్టించే దృశ్యాలే. విశాఖలో హుద్ హుద్ సృష్టించిన బీభత్సానికి పదేళ్లు నిండాయి. విశాఖపై హుద్‌ హుద్‌ తుపాను విరుచుకుపడి పదేళ్లు అయ్యింది. సరిగ్గా 2014 అక్టోబరు 12న తీరం దాటిన హుద్ హుద్ కుండపోత వర్షాలు కురిపించింది. దాని తీవ్రతతో దాదాపు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో భీకర … Read more

Araku: అందాల లోయ అరకులోయకు పర్యాటకుల తాకిడి

ఏపీలో అందాల లోయ, ఆంధ్ర ఊటీకి పర్యాటకుల తాకిడి పెరిగింది. దసరా సెలవులు, పండుగ హడావుడితో అందుకు కలిసి వచ్చింది. మన్యంలో ప్రకృతి అందాలను తిలకించేందుకు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు.  పర్యాటకులు ప్రకృతి ఒడిలో సందడి చేస్తున్నారు.  ప్రకృతి ప్రేమికుల సందడితో హోటల్ గదులన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి. కూల్ క్లైమేట్ లో ఎంజాయ్ చేస్తున్నారు సందర్శకులు. చాపరాయి, బొర్రా గుహలు, గిరిజన మ్యూజియం పద్మాపురం గార్డెన్స్, వ్యూ పాయింట్స్, వాటర్ ఫాల్స్ వద్ద సందర్శకులు సందడి … Read more