Visakhapatnam: విజయవాడ – విశాఖ మధ్య మరో రెండు విమాన సర్వీసులు

విశాఖపట్నం నుంచి విజయవాడ మధ్య విమాన ప్రయాణాలు చేసేవారికి అనుకూలంగా కొత్తగా రెండు విమాన సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం విశాఖ – విజయవాడ మధ్య ఒక్క సర్వీసు మాత్రమే రాకపోకలు సాగిస్తుండటంతో సరిపోవడంలేదు. అందుకే  కొత్తగా రెండు విమాన సర్వీసులను అందుబాటులోకి వస్తున్నాయని విశాఖ విమానాశ్రయం డైరెక్టర్ రాజారెడ్డి శనివారం  తెలిపారు. ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థల విమాన సర్వీసులను ఈరోజు (ఆదివారం) … Read more

VHP: జనవరి 5న హైందవ శంఖారావం.. వీహెచ్‌పీ బహిరంగ సభ

దేవాలయ వ్యవస్థ ప్రమాదంలో పడింది.. భక్తుల విశ్వాసాలు, మనోభావాలకు విలువలేకుండా పోయింది. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం హిందువుల మనోభావాలను దెబ్బతీశాయి..అని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి డాక్టర్ సురేంద్ర జైన్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమం సందర్భంగా ఆయన  ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు హిందువుల మనోభావాలు, సమస్యలను అర్థం  చేసుకోవాలని డిమాండ్ చేస్తూ జనవరి 5న విజయవాడలో హైందవ శంఖారావం … Read more

 Vijayawada: రాజరాజేశ్వరీదేవిగా కనకదుర్గమ్మ దర్శనం

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో  దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి.  పదో రోజైన శనివారం అమ్మవారు శ్రీరాజరాజేశ్వరీదేవిగా  దర్శనమిస్తున్నారు. విజయ దశమి ఉత్సవాల చివరి రోజు కావడంతో తండోపతండాలుగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మరో వైపు భవానీలు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. ఈ యేడాది  భవానీలు  అధిక సంఖ్యలో ఇంద్రకీలాద్రికి చేరుకోవడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి.   జై దుర్గ.. జై జై దుర్గ నామస్మరణతో మారుమోగుతున్నాయి. భక్తులు రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో … Read more

Kanaka durgamma: మహాలక్ష్మిగా దుర్గమ్మ దర్శనం.. రేపు పట్టువస్త్రాలు సమర్పించనున్న సిఎం చంద్రబాబు

రెండు తెలుగు రాష్ట్రాల్లోను దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా  జరుగుతున్నాయి. నేటితో ఆరో రోజుకు చేరాయి.  ఈ రోజు మంగళవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గాదేవి  నేడు మహా లక్ష్మి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మలగన్న అమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మను దర్శించుకునేందుకు తెల్లవారు జామున 4 గంటల నుంచి భక్తులు బారులు దీరారు. ఉత్సవాల్లో ఏడో రోజు బుధవారం  దుర్గాదేవి మూల నక్షత్రంలో సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రేపు … Read more

dasara navaratri utsavalu: ఇంద్రకీలాద్రిపై  ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేకువజామునే దుర్గమ్మకు  ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రోజు నుండి 12వ తేదీ వరకు రోజుకో అలంకారంలో అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తారు. భక్తుల కొంగుబంగారంగా పేరొందిన జగజ్జనని దర్శనానికి భక్తులు విశేషంగా తరలి వస్తున్నారు. దీంతో ఆలయం, పరిసర ప్రాంతాలు భక్తులతో సందడిగా మారాయి. దసరా ఉత్సవాల … Read more