టీడీపీ యూట్యూబ్ ఛానల్ హ్యాక్…!

తెలుగుదేశం పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయింది. ఉదయం నుంచి ఛానల్ ఓపెన్ కావడం లేదు. స్ట్రక్ అయినట్లు ఎర్రర్ మెసేజ్ వస్తోందని టీడీపీ నేతలు తెలిపారు. ఈ క్రమంలో యూట్యూబ్ ఛానల్ ను పునరుద్ధరించేందుకు పార్టీ టెక్నికల్ వింగ్ ప్రయత్నిస్తోంది. అదేవిధంగా ఛానల్ హ్యాక్ అవడంపై యూట్యూబ్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశామని టీడీపీ నేతలు తెలిపారు.

రేపు టీడీపీలోకి మాజీ మంత్రి ఆళ్ల నాని

మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రేపు టీడీపీలో చేరనున్నారు. ఈ మేరకు రేపు ఉదయం 11 గంటలకు ఆయన తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే బడేటి చంటి అధికారికంగా వెల్లడించారు. అయితే ఆళ్ల నాని టీడీపీలోకి రావడం పార్టీ శ్రేణులకు ఇష్టం లేదన్నారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆళ్ల నాని చేరికపై హైకమాండ్ నిర్ణయం తీసుకుందన్న ఆయన అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని తెలిపారు. అలాగే జగన్ … Read more

సభ్యత్వ నమోదులో టీడీపీ రికార్డ్..

సభ్యత్వ నమోదులో టీడీపీ నయా రికార్డ్ సాధించిందని ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సభ్యత్వాల సంఖ్య 73 లక్షలకు చేరిందని తెలిపారు. టాప్ -5 లో నెల్లూరు, రాజంపేట, పాలకొల్లు, మంగళగిరి, కుప్పం ఉన్నాయన్న ఆయన ఈ సందర్భంగా పార్టీ నేతలకు, కార్యకర్తలను అభినందించారు. కొత్త సభ్యత్వాలతో పాటు యువత, మహిళల సభ్యత్వాలు నమోదు అయ్యాయని చంద్రబాబు తెలిపారు. క్యాడర్ సంక్షేమం కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకు … Read more