sabarimala Train: సికింద్రాబాద్ to శబరిమలకు భారత్ గౌరవ్ రైలు

శబరిమలకు వెళ్లే భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ కొత్తగా భారత్ గౌరవ్ రైలును అందుబాటులోకి తెచ్చింది. పుణ్యక్షేత్రాలు, అధ్యాత్మిక ప్రాంతాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారత్ గౌరవ్ టూరిస్టు ట్రైన్‌కు యాత్రికుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుండటంతో తాజాగా సికింద్రాబాద్ నుండి శబరిమల యాత్రకు కూడా ప్రత్యేక ట్రైన్‌ను ఏర్పాటు చేసింది.  నవంబర్ 16 నుండి 20వ తేదీ వరకు కొనసాగుతున్న ఈ యాత్రకు సంబంధించి బ్రోచర్‌ను దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ఆవిష్కరించారు. … Read more

Pawan Kalyan: ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసంపై పవన్ కల్యాణ్ ఆగ్ర‌హం

సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ధ్వంసంపై  డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పందించారు.  విగ్రహ ధ్వంసం దుర్మార్గం అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అమ్మవారి విగ్రహం కూల్చడం తనను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మహాపచారం అని అన్నారు.  ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలను ఇలా అపవిత్రం చేయడం చూశానని ఆయన వాపోయారు. ఇటువంటి దుర్మార్గాలపై చాలా బలమైన చర్యలు అవసరమన్నారు. అందుకే తిరుపతిలో జరిగిన వారాహి డిక్లరేషన్ సభలో చెప్పానని ప‌వ‌న్, ఇటువంటి … Read more

Secunderabad – Sri Muthyalamma Temple: అమ్మవారి విగ్రహం ధ్వంసం – ముత్యాలమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత

సికింద్రాబాద్: మోండా మార్కెట్ సమీపంలోని కుమ్మరిగూడలో ముత్యాలమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయం తెలియడంతో ఆలయం వద్దకు పెద్ద సంఖ్యలో స్థానికులు చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు.  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  ఆలయం వద్దకు చేరుకున్నారు. సీపీ సీవీ ఆనంద్ కలిసి గుడి లోపలికి వెళ్లి పరిశీలించారు. పోలీసు ఉన్నతాధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి … Read more