పోలవరం ప్రాజెక్టు సందర్శనకు సీఎం చంద్రబాబు

పోలవరం ప్రాజెక్టును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సందర్శించారు. ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టును పరిశీలించారు. హిల్ వ్యూ పాయింట్ నుంచి పోలవరం డ్యామ్ ను పరిశీలించిన ఆయన డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ క్రమంలోనే పనులు జరుగుతున్న తీరుపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రాజెక్టు ఇంజినీర్లు, అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అలాగే పర్యటన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను ఆయన తిలకించారు. … Read more