sabarimala: కిటకిటలాడుతున్న శబరిమల

కార్తీకం రాగానే శబరిమల అయ్యప్ప భక్తులతో సందడి నెలకొంటుంది. మండల దీక్ష చేపట్టిన అయ్యప్ప దీక్షా స్వాములు వేలాదిగా స్వామిని దర్శించుకుని ఇరుముడి సమర్పించి దీక్ష విరమిస్తున్నారు. మండల మకరవిళక్కు సీజన్ ఆరంభం నుండి భక్తుల రద్దీ కొనసాగుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భక్తుల తాకిడి రెట్టింపైంది.   ఆలయం నవంబర్ 16న తెరుచుకోగా 6,12,290 మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు. భక్తుల రద్దీ వివరాలను ఆదివారం దేవస్థానం (ట్రావెన్‌కోర్ దేవస్వాం బోర్డు) అధ్యక్షుడు … Read more

Kerala Govt: అయ్యప్ప భక్తులకు కేరళ సర్కారు ఆఫర్

అయ్యప్ప స్వామి భక్తులకు కేరళ సర్కారు మాంచి ఆఫర్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తోంది.  దీక్షల సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. శబరిమల వచ్చే అయ్యప్పస్వాములకు ఉచితంగా జీవిత బీమా సదుపాయం కల్పించాలని నిర్ణయించింది.  సీఎం పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో ఈరోజు చర్చించారు. అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాములు శబరిమల యాత్ర సందర్భంగా మరణిస్తే, వారి కుటుంబానికి రూ.5 లక్షలు అందించనున్నారు. అంతేకాదు, ఆ భక్తుడి … Read more

Thiruvonam Bumper Lottery:  రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ఓ మెకానిక్

ఓ మెకానిక్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. అదృష్టం తలుపుతట్టింది అన్నట్టు అతడికి భారీ జాక్ పాట్ కాళ్లదగ్గరకు వచ్చి పడింది. అంతే ఊహించని విధంగా డబ్బు వచ్చిపడింది. ఇంకే ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు. కర్ణాటకకు చెందిన ఓ మెకానిక్‌  అల్తాఫ్ కు కేరళ తిరువోణం బంపర్ లాటరీ తగిలింది.  దీంతో అత‌డి బ్యాంక్ ఖాతాలోకి రాత్రికి రాత్రే రూ. 25కోట్లు వ‌చ్చి పడ్డాయి. ఆ లాటరీకి సంబంధించిన డ్రాను తిరువ‌నంత‌పురంలోని గోర్కీ భ‌వ‌న్‌లో బుధ‌వారం మ‌ధ్యాహ్నం 2 … Read more

Sabarimala: అయ్యప్ప దర్శనానికి ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాల్సిందే.. 

కార్తీక మాసం రాబోతోంది. అయ్యప్ప దీక్షలకు సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప స్వామి దర్శనానికి  ఇకపై ఆన్ లైన్ లో స్లాట్ బుక్ చేసుకోవాలని, అలా బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునే వీలుంటుందని ఇవాళ సీఎం పినరయి విజయన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో  నిర్ణయం తీసుకున్నారు. అయ్యప్ప భక్తులు పరమపవిత్రంగా భావించే మకరవిళక్కు సీజన్ మరో నెల రోజుల్లో ప్రారంభం కానుంది.  అయితే … Read more