Revanth Gives Appointment Orders to DSC Candidates: డీఎస్సీలో ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేస్తున్న సీఎం రేవంత్

హైదరాబాద్: రాష్ట్రంలో దసరా వేడుకకు ముందే పండుగ వాతావరణం నెలకొంది. డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందిస్తున్నారు. ఎల్​బీ స్టేడియం వేదికగా జరుగుతున్న కార్యక్రమంలో దాదాపు పదివేల మందికిపైగా నియామక పత్రాలను అందుకోనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసిన సర్కారు మొత్తం ప్రక్రియను వేగంగా పూర్తి చేయటంతోపాటు బ్యాక్ లాగ్ పోస్టులు లేకుండా చర్యలు తీసుకుంది. నియామక పత్రాలు అందుకునే వారు, వారి కుటుంబసభ్యులతో ఎల్బీ స్టేడియం కళకళలాడుతోంది. … Read more