పోలవరం ప్రాజెక్టు సందర్శనకు సీఎం చంద్రబాబు

పోలవరం ప్రాజెక్టును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సందర్శించారు. ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టును పరిశీలించారు. హిల్ వ్యూ పాయింట్ నుంచి పోలవరం డ్యామ్ ను పరిశీలించిన ఆయన డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ క్రమంలోనే పనులు జరుగుతున్న తీరుపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రాజెక్టు ఇంజినీర్లు, అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అలాగే పర్యటన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను ఆయన తిలకించారు. … Read more

సభ్యత్వ నమోదులో టీడీపీ రికార్డ్..

సభ్యత్వ నమోదులో టీడీపీ నయా రికార్డ్ సాధించిందని ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సభ్యత్వాల సంఖ్య 73 లక్షలకు చేరిందని తెలిపారు. టాప్ -5 లో నెల్లూరు, రాజంపేట, పాలకొల్లు, మంగళగిరి, కుప్పం ఉన్నాయన్న ఆయన ఈ సందర్భంగా పార్టీ నేతలకు, కార్యకర్తలను అభినందించారు. కొత్త సభ్యత్వాలతో పాటు యువత, మహిళల సభ్యత్వాలు నమోదు అయ్యాయని చంద్రబాబు తెలిపారు. క్యాడర్ సంక్షేమం కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకు … Read more

డోకిపర్రుకి సీఎం చంద్రబాబు నాయుడు

డోకిపర్రు గ్రామానికి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీభూ సమేత వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరు సీఎం రాక నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామాన్ని సీఎం చంద్రబాబు నాయుడు సందర్శించనున్నారు. అక్కడ కొలువుదీరిన శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో నవమ వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఆయన హాజరుకానున్నారు. ఈ మేరకు సాయంత్రం బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్న చంద్రబాబు నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ … Read more