అమరావతిపైనే చంద్రబాబు ఫోకస్..

రాజధాని అమరావతి కోసం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముందుకు తీసుకుపోవడానికి వడివడిగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా రాజధానిలో చేపట్టాల్సిన పనులపై ఇవాళ ఏపీ కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. సీఆర్డీఏ ఆధారిటీ స‌మావేశంలో ఆమోదం తెలిపిన రూ. 24,276 కోట్ల పనులకు చర్చ జరగనుంది. అలాగే విజ‌య‌వాడ బుడ‌మేరు ముంపు బాధితుల‌కు రుణాల రీషెడ్యూల్‌ కోసం స్టాంప్‌ డ్యూటీ … Read more

Amaravati Drone Show: అమరావతిలో 5 వేలకు పైగా డ్రోన్లతో మెగా షో..

ఒకటి కాదు, వందకాదు ఏకంగా ఐదువేలకు పైగా డ్రోన్లు అమరాతి గగనతలంలో షికారు చేయబోతున్నాయి.  జాతీయ స్థాయి డ్రోన్ సమ్మెట్‌ను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించనున్నారు.  ఈ డ్రోన్ స‌మ్మిట్‌కు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. పున్నమి ఘాట్ దగ్గర 5వేల‌కుపైగా డ్రోన్లు 9 థీమ్స్‌పై రకరకాల కార్యక్రమాల్లో పాల్గొంటాయి. 400కి పైగా కంపెనీలు పాల్గొనే ఈ  సమ్మెట్ లో 1800 మంది డెలిగేట్స్ హాజరవుతారు.  … Read more

Amaravati: అమరావతికి త్వరలో కొత్త రైల్వే లైన్: జీఎం అరుణ్ కుమార్

ఏపీ రాజధాని అమరావతిలో రైల్వే లైన్ ఏర్పాటునకు సర్వే పూర్తి అయిందని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ చెప్పారు. ఎర్రుపాలెం – అమరావతి – నంబూరు లైన్ సర్వే పూర్తయిందని రైల్వే బోర్డు ఆమోదం రాగానే  కొత్త రైల్వే లైన్ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్ పరిధిలోని పార్లమెంట్ సభ్యులతో శుక్రవారం విజయవాడ సత్యనారాయణపురం వద్ద ఉన్న ఎలక్ట్రికల్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్‌లో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో 73 … Read more

Amaravati: శైవ క్షేత్రంలో మంగళ గౌరీ పూజ

ఏపీ రాజధాని అమరావతిలోని శైవ క్షేత్రంలో శ్రావణమాసం రెండవ మంగళవారం సందర్భంగా మంగళ గౌరీ అమ్మవారికి పసుపు కొమ్ములతో అర్చన, పూజలు ఘనంగా జరిగాయి. శైవ క్షేత్రం పీఠాధిపతి శివస్వామి ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమానికి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్మించి గౌరీమాత అనుగ్రహంపొందారు.