టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ ఓ సంచలనం సృష్టించాడు. దీంతో దేశంలోనే వార్తల్లోకెక్కాడు. బెంగళూరు వేదికగా భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు. 99 పరుగుల వద్ద కివీ పేసర్ విలియం ఓరూర్క్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. మోకాలికి గాయం కావడంతో పంత్ మూడవ రోజు ఫీల్డ్‌లోకి రాలేదు. దీంతో బ్యాటింగ్ సమర్థవంతంగా చేయగలడో లేదోనని అందరిలోను సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ పంత్ ఆ సందేహాలకు చెక్ పెట్టాడు. ఏమాత్రం తగ్గకుండా బ్యాటింగ్‌లో తన సత్తా చాటాడు.
వికెట్‌ను కాపాడుకుంటూనే పంత్ వేగంగా పరుగులు సాధించాడు. 105 బంతుల్లోనే 99 పరుగులు సాధించాడు. తన ఇన్నింగ్స్‌లో నాలుగు సిక్సర్లు బాది ప్రేక్షకులను అలరించాడు. ఒక సిక్సర్‌ను ఏకంగా 107 మీటర్లు బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. కివీస్ స్టార్ పేసర్ టిమ్ సౌథీ బౌలింగ్‌లో ఒక బంతిని బలంగా కొట్టాడు. అది 107 మీటర్ల సిక్సర్‌గా మారింది. బంతి వెళ్లి ఎం చిన్నస్వామి స్టేడియం పైకప్పు మీద పడింది. ఈ షాట్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ షేర్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.