పురుషులతో అన్ని రంగాలలోనూ మన మహిళలు పోటీ పడుతున్నారు. ఇటీవల వ్యాపారాలలోను దూసుకుపోతున్నారు . మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడానికి కేంద్ర సర్కార్ అనేక సహకారాలు అందిస్తోంది. రుణాలే కాకుండా సబ్సిడీ కూడా ఇవ్వడంతో మహిళ ఎంటర్ ప్రెన్యూర్స్ కి భుజం తట్టినట్లనిపిస్తోంది .
మహిళలకు బిజినెస్ హెల్ప్ అంటే . .. చిన్న చిన్న కుట్టుమిషన్లు , అప్పడాలు , వడియాల తయారీలకే కాదు . .. మార్కెట్ లో ఎదుగుదలకు ఛాన్స్ ఉన్న (నైతికంగా ) ఏ బిజినెస్ కైనా కేంద్రం సాయం అందించడానికి రెడీగా ఉంది .
బయో కాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా , తెలుగు మహిళ, బయలాజికల్-ఈ ఫార్మా కంపెనీ చైర్మన్ దాట్ల మహిమ వేల కోట్ల టర్నోవర్‌తో సక్సెస్ ఫుల్ గా నడుపుతున్నారు. మార్గదర్శి చిట్స్ ని చెరుకూరి శైలజ , –ఇలా ఎందరో మన నారీమణులు బిజినెస్ లోను రాణిస్తున్నారు . సామాన్య , మధ్యతరగతి మహిళలకు కూడా ఇలాంటి బిజినెస్ ఛాన్స్ ఇవ్వాలని నరేంద్ర మోడీ సర్కార్ సంకల్పంతో ఉంది .
దేశంలో ఇప్పటివరకు 100 కంటే ఎక్కువ యునికార్న్‌లు ఉన్నాయి. పురుషులే కాదు, మహిళలు కూడా కొన్ని సంస్థలకు ముందుండి వ్యవస్థాపకులుగా (Women Entrepreneurs) తమ స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. ఇలాంటి క్రమంలో మీరు మహిళ అయితే వ్యాపార ప్రణాళికను కలిగి ఉంటే, మీరు కూడా పనులను ప్రారంభించవచ్చు. దీనికి నిధుల సమస్య కూడా ఉండదు.
నిధుల ఏర్పాటు
మంచి స్టార్టప్‌లకు సహాయం చేయడానికి భారత ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలను ప్రారంభించింది. ఆర్థిక సలహాదారు ఆర్తీ భట్నాగర్ ఇటీవలే స్టార్టప్‌లు తమ వ్యాపారాన్ని పురోగమింపజేసేందుకు రూ. 5 కోట్ల వరకు పొందవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకం కింద మహిళల నేతృత్వంలోని స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడానికి ప్రతి ఇంక్యుబేటర్‌కు రూ. 5 కోట్లు కేటాయిస్తున్నట్లు గుర్తు చేశారు. ఇది కేవలం నిధుల గురించి మాత్రమే కాదన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలకు అవసరమైన వనరులు సమకూర్చడం, వారి వెంచర్లను అభివృద్ధి చేయడానికి గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమన్నారు.
మహిళా ఎంటర్ ప్రెన్యూర్స్ కోసం . ..
వ్యాపారాల విషయంలో మహిళా పారిశ్రామికవేత్తలు కొత్త ఆవిష్కర్తలతో ముందుకొస్తే భారతదేశ సుస్థిరత ప్రయాణంలో మార్పుకు అవకాశం ఉంటుందని భట్నాగర్ ఈ సందర్భంగా తెలిపారు . వివిధ అవసరాల కోసం స్టార్టప్‌లకు ఆర్థిక సహాయం అందించడానికి రూ. 945 కోట్లతో DPIIT స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ (SISF)ని ప్రకటించారు. SISF కాన్సెప్ట్ ఉద్దేశం ప్రోటోటైప్ డెవలప్మెంట్, ప్రోడక్ట్ టెస్టింగ్, మార్కెట్ ఎంట్రీ, వాణిజ్యీకరణ కోసం స్టార్టప్‌లకు ఆర్థిక సహాయం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది కొత్తగా ప్రారంభించిన స్టార్టప్‌లు లేదా వెంచర్ క్యాపిటలిస్ట్‌లతో పోటీపడే దశకు మద్దతు కల్పించడానికి ఈ పధకం ద్వారా వీలవుతుంది .
వెంచర్ క్యాపిటల్స్ కూడా ఛాన్స్ . …
. ఈ పథకం 2021లో ప్రారంభించబడింది. ఇది ఇప్పటికే 300 ఇంక్యుబేటర్ల ద్వారా 3,600 మంది పారిశ్రామికవేత్తలకు మద్దతునిస్తుందిఈ ఫండ్ పొందాలనుకునే వారు ప్రభుత్వ వెబ్సైట్ ( seedfund.startupindia.gov.in ) సీడ్ ఫండ్ డాట్ స్టార్ట్ అప్ ఇండియా డాట్ gov.in కి లాగిన్ అవ్వాలి . దీని ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇదే సమయంలో వెంచర్ క్యాపిటల్ (VC) ఫండ్లు మేనేజ్మెంట్ ఇన్వెస్ట్మెంట్ పూల్స్‌గా ఉంటాయి. ఇవి అధిక అభివృద్ధి గల స్టార్టప్‌లు, ఇతర ప్రారంభ దశ సంస్థలలో పెట్టుబడి పెడతాయి. ఇవి సాధారణంగా గుర్తింపు పొందిన పెట్టుబడిదారులకు మాత్రమే అమల్లో ఉంటాయి.