భారతదేశం (India) లోని చాలా రాష్ట్రాల్లో మద్యపాన నిషేధం (Prohibition of alcohol) అమలులో ఉంది. ఇతర రాష్ట్రాల్లో మద్యం విక్రయాలు జరుగుతున్నప్పటికీ అక్కడ కూడా మద్యాన్ని నిషేధించాలన్న డిమాండ్ ( Demand) వినిపిస్తోంది. అయితే తాజాగా కేంద్ర కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (Union Ministry of Family Welfare) ఆధ్వర్యంలో జాతీయ కుటుంబ సంక్షేమంపై ఓ సర్వే ( Survey) జరిగింది. దీంతో దేశంలోని రాష్ట్రాల్లో మద్యం వినియోగదారుల సంఖ్య గురించి ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
దేశంలోని నగరాల్లో నివసించే వారి కంటే గ్రామాల్లో నివసించే వారే ఎక్కువగా మద్యం సేవిస్తున్నారని ఈ అధ్యయనం ద్వారా తెలిసింది. మద్యం సేవించే వారిని మహిళలు, పురుషులు అనే రెండు గ్రూపులుగా విభజించగా.. 15 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న పురుషులు 18.7 శాతం, స్త్రీలు 1.3 శాతం మద్యంపానం చేస్తున్నారని తేలింది.
రాష్ట్రాల వారీగా విభజించినట్లయితే.. దేశంలో అత్యధిక సంఖ్యలో మద్యం సేవించే వారు ఉన్న రాష్ట్రాలలో అరుణాచల్ ప్రదేశ్ ( Arunachal Pradesh) మొదటిస్థానంలో ఉందని సర్వేలో వెల్లడైంది. ఈ రాష్ట్రంలో సుమారు 52.6 శాతం మంది పురుషులు మద్యానికి బానిసలుగా ఉన్నారని తెలుస్తోంది. ఆ తరువాత స్థానంలో తెలంగాణ ( Telangana ) రాష్ట్రం ఉండగా.. ఇక్కడ సుమారు 43.4 శాతం మంది పురుషులు మద్యానికి బానిసలుగా ఉన్నారు.ఇక మూడో స్థానంలో సిక్కిం 39.9 శాతంతో ఉండగా అండమాన్ 38.8 శాతంతో ఉన్నాయి. తరువాతి స్థానాల్లో మణిపూర్, గోవా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు ఉన్నాయి.
మహిళా తాగుబోతుల జాబితా ప్రకారం అరుణాచల్ ప్రదేశ్ ( Arunachal Pradesh) రాష్ట్రం 24.2 శాతంతో మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత స్థానాల్లో సిక్కిం ( Sikkim) 16.2 శాతం, అస్సాం 7.3 శాతం, తెలంగాణ 6.7 శాతం, జార్ఖండ్ 5.7 శాతం తాగుబోతులు ఉండగా.. తరువాత స్థానాల్లో అండమాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు ఉన్నాయని సర్వే ప్రకారం వెల్లడైంది.