మిల్కీ బ్యూటీ తమన్నాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విచారణ చేపట్టారు. మనీ లాండరింగ్ ఆరోపణలపై ప్రశ్నించినట్లు ఈడీ అధికార వర్గాలు తెలిపాయి. హెచ్ పీ జెడ్(HPZ) టోకెన్ మొబైల్ యాప్‌కు సంబంధించిన వ్యవహారంలో ఈడీ ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం. ఈ యాప్ ద్వారా బిట్ కాయిన్, క్రిప్టోకరెన్సీలను మైనింగ్ సాకుతో చాలామంది ఇన్వెస్టర్లను మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కేవలం యాప్‌ను ప్రమోట్ చేసినందుకే ఆమెను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గౌహతి కార్యాలయంలో విచారించినట్లు తెలుస్తోంది. అంతకు ముందు ఈడీ కార్యాలయానికి తన తల్లితో కలిసి వచ్చింది తమన్నా. యాప్‌ను ప్రమోట్ చేశారని.. అందుకు కొంత డబ్బు కూడా తీసుకున్నారని.. ఆమెపై ఎలాంటి నేరారోపణలు లేవని సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి.
తమన్నా గతంలో కూడా మహదేవ బెట్టింగ్ యాప్‌కు సంబంధించిన కేసులో ఈడీ విచారించింది. మహాదేవ అనుబంధ సంస్థ అయిన ఫెయిర్ ప్లే యాప్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ గేమ్ మ్యాచ్ లను ప్రసారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మహారాష్ట్ర సైబల్ సెల్ ఏప్రిల్ ను విచారణకు పిలిచింది. మార్చిలో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ లో 76 చైనీస్ నియంత్రిత సంస్థలతో సహా 299 సంస్థలను నిందితులుగా చేర్చింది. ఇందులో పది మంది చైనీస్ మూలాలు ఉన్న డైరెక్టర్లు ఉన్నారు.