Ratan Tata: అప్పటి ప్రధానికి స్వయంగా లేఖ రాసిన రతన్ టాటా..ఆ లేఖలో ఏముంది ?

భారతదేశానికి అత్యంత ఆవశ్యకమైన ఆర్థిక సంస్కరణలను చేపట్టారంటూ వ్యక్తిగతంగా మెచ్చుకుంటూ రతన్ టాటా ఈ లేఖ రాశారు.

 వ్యాపారం ,  పరిశ్రమలకు విలువలను జోడించి నిబద్దతతో దశాబ్దాలుగా కొనసాగిస్తున్న టాటా కంపెనీ నిర్వహణ వెనుక రతన్ టాటా సంకల్పం అర్ధం అవుతుంది .  రతన్ జీ 1996లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావుకు రాసిన లేఖ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది .     రతన్ టాటాను గుర్తుచేసుకుంటూ ఆర్‌పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష గోయెంకా ఈ లేఖను ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ‘‘ఒక అందమైన వ్యక్తి నుంచి అందమైన రచన…’’ అని గోయెంకా క్యాప్షన్ ఇచ్చారు.

పీవీ నరసింహారావును ఉద్దేశించి రతన్ టాటా ఈ లేఖను చేతితో రాశారు. భారతదేశానికి అత్యంత ఆవశ్యకమైన ఆర్థిక సంస్కరణలను చేపట్టారంటూ వ్యక్తిగతంగా మెచ్చుకుంటూ రతన్ టాటా ఈ లేఖ రాశారు. పీవీ నరసింహా రావు సాధించిన ‘అత్యుత్తమ విజయాలు’’ అని కొనియాడారు. భారతదేశాన్ని గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలో ఒక భాగంగా మార్చారంటూ ప్రశంసల జల్లుకురిపించారు. సాహసోపేతంగా, దూరదృష్టితో సంస్కరణలు చేపట్టారని, ప్రతి భారతీయుడు తమరికి రుణపడి ఉండాలని లేఖలో రతన్ టాటా పేర్కొన్నారు. దేశ ఆర్థిక పురోగతి విషయంలో రతన్ టాటా ఎంత నిబద్ధతతో నడుచుకున్నారో ఈ లేఖను బట్టి అర్థం చేసుకోవచ్చు.