అమరావతి శరవేగంగా అభివృద్ధి చెందడానికి దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానం కావాల్సి ఉంది . ఇందుకోసం మాకు ప్రత్యేక రైల్వే లైన్ కావాలి . . అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పది రోజుల క్రితం కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ట్నవ్ ని రిక్యస్ట్ చేసారు . బాబు విజ్ఞప్తి కి కేంద్ర కేబినెట్ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అమరావతి కి మరో బూస్ట్ అప్ ఇచ్చినట్లయినది .
కేంద్ర ప్రభుత్వం అమరావతిలో 57 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.2,245 కోట్లతో త్వరలో నూతన రైల్వే లైన్ నిర్మాణం మొదలు కానుంది . ఇందులో కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల వంతెన నిర్మాణానికి ఆమోదం కుదిరింది. 10 రోజుల కిందట సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి.. కేంద్ర పెద్దల్ని కలిసి.. అమరావతికి రైల్వే లైన్ కావాలని కోరారు. ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశమై.. అనేక నిర్ణయాలు తీసుకుంది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆనందం . .
“దేశంలోని కీలక నగరాలను అమరావతి రైల్వే లైన్ అనుసంధానం చేస్తుంది . దేశ అభివృద్ధికి ఇది బూస్ట్ లాగా ఉంటుంది. ఇది మేము కొంతకాలంగా కోరుకుంటున్నది. ఇలాంటి అద్భుత ప్రాజెక్ట్ మాకు మంజూరు చేయడం . . గొప్ప విషయం. ఇలాంటి చర్యలు వాయు కాలుష్యాన్ని తగ్గిస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల అమరావతి.. త్వరలో హైదరాబాద్‌కి కనెక్ట్ అవుతుంది. విజయవాడకి కనెక్ట్ అవుతుంది. ప్రాచీన ఆలయాలకు కనెక్టివిటీ పెరుగుతుంది. అలాగే కీలక ఓడ రేవులకు కూడా కనెక్టివిటీ పెరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కి ధన్యవాదాలు. మీ పాలనా అనుభవంతో… ఈ ప్రాజెక్టును ఏపీకి ఇచ్చారు. 2029లోపే దీన్ని పూర్తి చెయ్యడానికి ప్రయత్నిస్తాం” అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆనందం వ్యక్తం చేసారు .
సీఎం చంద్రబాబు ఉత్స్తాహం :
“కేవలం 10 రోజుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. మేము కూడా ఇదే వేగంతో పనిచేస్తాం. నాలుగేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. ఈ దేశంలోని అన్ని నగరాలతో అమరావతి కనెక్ట్ అవుతుంది. అమరావతిలో ప్రస్తుతం 17వేల కోట్ల ప్రాజెక్టులు నడుస్తున్నాయి. విశాఖ రైల్వే జోన్ సహా చాలా పెండింగ్ సమస్యలు ఉన్నాయి. 10 రోజుల్లో మీరు అన్నీ చేశారు. ఈ ప్రాజెక్టును ఏపీకి ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కి ధన్యవాదాలు. వచ్చే నెల్లో ఈ రైల్వేలైన్ శంకుస్థాపనకు ప్రధాని మోదీని ఆహ్వానిస్తాము . . అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు .