ఢిల్లీ: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆహ్వానించారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు వంశీయుల అభీష్టం మేరకు ఆహ్వానం పలికినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 13 నుంచి 15 వరకు పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఓం బిర్లాను కలిసిన సందర్భంగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అప్పలనాయుడు ఆయనకు అందజేశారు.