Constable: మణిపూర్ లో ఎస్ఐని కాల్చి చంపిన కానిస్టేబుల్

ఓ కానిస్టేబుల్ పాయింట్ బ్యాంక్ రేంజ్ లో తన పై అధికారైన ఎస్ఐపై కాల్పులకు పాల్పడ్డాడు.  దీంతో కుర్చీలో కూర్చున్న ఎస్ఐ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మణిపూర్ లోని జిరిబామ్ జిల్లాలో శనివారం చోటుచేసుకుందీ ఘోరం. కాల్పులు జరిపిన కానిస్టేబుల్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మణిపూర్ లో కొంతకాలంగా అల్లర్లు జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో పలు గ్రామాల్లో పోలీస్ పోస్ట్ లు ఏర్పాటు చేసి హింస చెలరేగకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. జిరిబామ్ … Read more

Bike rider: బైక్ రైడ్ క్యాన్సిల్ చేసినందుకు.. మహిళా డాక్టర్‌కు వేధింపులు

ఓలా లాంటి బైక్ రైడింగ్ అందుబాటులోకి చాలా మందికి ఎందో ఉపయోగంగా ఉంది. ముఖ్యంగా బైక్, కారు లేనివాళ్లు ఎక్కడికైనా వెళ్లాలంటే చాలా సులువుగా అక్కడికి చేరుకోగలుగుతున్నారు. ముఖ్యంగా మహిళలకు ఇంకా  బాగా ఉపయోగపడుతోంది. దీంతో ఈ బైక్ రైడర్స్ గిరాకీ బాగా పెరిగింది. కాని చాలా మంది వేధింపులకు కూడా గురవుతున్నారు. ఈ విధంగా ఓ యాప్ ద్వారా బుక్ చేసుకుని రైడ్ ను  క్యాన్సిల్ చేసిన ఓ మహిళా డాక్టర్ కు వేధింపులు ఎదురయ్యాయి. … Read more

Kerala Govt: అయ్యప్ప భక్తులకు కేరళ సర్కారు ఆఫర్

అయ్యప్ప స్వామి భక్తులకు కేరళ సర్కారు మాంచి ఆఫర్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తోంది.  దీక్షల సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. శబరిమల వచ్చే అయ్యప్పస్వాములకు ఉచితంగా జీవిత బీమా సదుపాయం కల్పించాలని నిర్ణయించింది.  సీఎం పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో ఈరోజు చర్చించారు. అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాములు శబరిమల యాత్ర సందర్భంగా మరణిస్తే, వారి కుటుంబానికి రూ.5 లక్షలు అందించనున్నారు. అంతేకాదు, ఆ భక్తుడి … Read more

Tirumala: తిరుమలలో ఒకరోజు అన్నప్రసాద వితరణ చేయాలంటే ఎంత డొనేట్ చేయాలో?

తిరుమల శ్రీవారి క్షేత్రంలో నిర్వహించే నిత్యాన్నదానం గురించి తెలిసిందే. ఈ అన్నదాన కార్యక్రమానికి ప్రతిరోజు భక్తులు కోట్లలో పాల్గొంటారు. ఖర్చుకూడా కోట్లలోనే ఉంటుంది. అయితే కొందరు భక్తులు అన్నదానం నిర్వహించడానికి విరాళాలు ఇస్తారు. ఎంతోమంది భక్తులు మొక్కుల రూపంలో స్వామి వారికి కానుకలు సమర్పించుకుంటారు. కొందరు మాత్రం భక్తుల అల్పాహారం, అన్న ప్రసాదాల కోసం విరాళం ఇస్తుంటారు. మరెంతోమంది విరాళం ఇవ్వాలనుకుంటారు. అయితే, దేనికి ఎంత మొత్తం ఇవ్వాలన్న విషయం తెలియక సతమతమవుతుంటారు.   ఇలాంటి వారికోసం తిరుమల … Read more

Salman Khan: రూ. 2 కోట్లు ఇవ్వకపోతే చంపుతాం.. సల్మాన్ ఖాన్ కు మళ్లీ బెదిరింపులు

సల్మాన్ ఖాన్ అంటే మనదేశంలో పరిచయం అక్కరలేని నటుడు. చిన్న  స్థాయినుంచి నటనలో తనను తాను నిరూపించుకొని ఒక్కో మెట్టు ఎక్కుతూ సూపర్ స్టార్ అయ్యాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అగ్రస్థాయికి ఎదిగాడు.  సల్మాన్ ఖాన్ పై ఎప్పటి నుంచో హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి. బెదింపులు కూడా చాలా సార్లు వచ్చాయి.  తాాజాగా ఇప్పుడు మళ్లీ బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ముంబై ట్రాఫిక్ పోలీస్‌కు మెసేజ్ చేస్తూ.. సల్మాన్ రూ. 2 కోట్లు … Read more

JEE Main 2025: ఇదే.. జేఈఈ మెయిన్-2025 షెడ్యూల్

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి జేఈఈ (మెయిన్) ఎగ్జామ్స్ షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) రిలీజ్ చేసింది. రెండు సెషన్లుగా ఈ పరీక్షలు నిర్వహించనుంది. జనవరి నెలలో జేఈఈ సెషన్ -1 ను, ఏప్రిల్ నెలలో సెషన్ -2ను నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. అక్టోబర్ 28 నుంచి నవంబర్ 22 వరకు జనవరి సెషన్‌కి సంబంధించి ఆన్‌లైన్ లో దరఖాస్తులు స్వీకరించనుంది. ఈ సెషన్‌కు సంబంధించి 2025 జనవరి 22 నుంచి 31 వరకు ఎగ్జామ్స్ … Read more

Fireworks Accident: కేరళ ఆలయ వేడుకల్లో విషాదం.. బాణసంచా పేలి 154 మందికి గాయాలు

కేరళ ఆలయ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. బాణసంచా పేలి 154 మంది గాయపడ్డారు. వీరిలో 8 మందికి తీవ్ర గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కసరగడ్ జిల్లా నీలేశ్వర్‌లోని అంజూతంబళం వీరెర్కవు ఆలయంలో గత అర్ధరాత్రి జరిగింది ఈ ఘటన. సంప్రదాయ తెయ్యం పండుగ సందర్భంగా 1500 మంది ప్రజలు ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పేల్చిన టపాసుల రవ్వలు బాణసంచా నిల్వచేసిన గదిలోకి వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. బాణసంచా ఒక్కసారిగా పేలడంతో … Read more

Vijay: రాజకీయాలు పాములాంటివి.. బరిలోకి దిగాక భయపడేదే లేదు.. హీరో విజయ్

ద్రవిడియన్ మోడల్ పేరుతో లూటీ చేయడాన్ని సహించేది లేదని తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు విజయ్ అన్నారు. విజయ్ పార్టీని ప్రారంభించిన ఎనిమిది నెలల తర్వాత మొదటిసారి విల్లుపురంలో ర్యాలీ నిర్వహించి, బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా అధికార డీఎంకేపై పరోక్షంగా విమర్శలు చేశారు. వివిధ అంశాలతో దేశాన్ని విభజించే శక్తులు, అవినీతికి పాల్పడేవారు తమ పార్టీకి శత్రువులు అన్నారు. ద్రవిడాన్ని, తమిళ జాతీయతను తమ పార్టీ వేరుగా … Read more

Edible oil prices: సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన వంటనూనె ధరలు

పామాయిల్ ధర మళ్లీ పెరిగింది. దీపావళి ముందు కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు షాక్ ఇచ్చింది.  వంటనూనెల ధరలు భారీగా పెరిగాయి. ఎక్కువగా వినియోగించే పామాయిల్ ధరలు గత నెలతో పోల్చితే ఏకంగా 37 శాతం మేర పెరిగాయి. సన్‌ఫ్లవర్, ఆవనూనెల ధరలు కూడా   29 శాతం పెరిగాయి. పండగ సీజన్ వేళ ఈ ధరల పెరుగుదల సామాన్యుల బడ్జెట్‌లను ప్రభావితం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే వంటనూనెను అధికంగా ఉపయోగించే రెస్టారెంట్లు, హోటళ్లు, స్వీట్ షాపుల వ్యయాలు … Read more

CDSCO: 3వేల రకాల మందులకు నాణ్యతా పరీక్షలు.. వెలుగులోకి వచ్చిన భయంకర విషయాలు

సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో) చాలా ఆసక్తి కరమైన విషయాలను భయటపెట్టింది. ఔషధాల నాణ్యతా పరీక్షలకు సంబంధించిన సెప్టెంబర్ నెల రిపోర్ట్‌ను ప్రకటించింది.  మొత్తం 3000 ఔషధాలను పరీక్షించగా 49 ఔషధ ఉత్పత్తులు అవసరమైన ప్రమాణాలకు అనుగుణంగా లేవని వెల్లడించింది. నాణ్యతా పరీక్షలో విఫలమైన మందుల జాబితాలో లైఫ్ మ్యాక్స్ క్యాన్సర్ ల్యాబొరేటరీస్ తయారు చేసే కాల్షియం 500 ఎంజీ, విటమిన్ డీ3 250 ఐయూ టాబ్లెట్స్‌తో పాటు ఇతర మందులు ఉన్నాయని కీలకమైన … Read more