హైపర్ సోనిక్ సక్సెస్

భారత్ అంబుల పొడిలో మరో రామబాణం వచ్చి చేరింది . ”ఒడిశా తీరంలోని డాక్టర్ APJ అబ్దుల్ కలాం ద్వీపం నుంచి, లాంగ్ రేంజ్ హైపర్‌సోని క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడం ద్వారా భారతదేశం ఒక ప్రధాన మైలురాయిని సాధించింది” అని రక్షణ మంత్రి X ద్వారా తెలిపారు . “ఇది ఒక చారిత్రాత్మక క్షణం. ఈ ముఖ్యమైన విజయం. అలాంటి క్లిష్టమైన, అధునాతన సైనిక సాంకేతికతలను కలిగి ఉన్న, దేశాల సమూహంలో మన దేశం కూడా చేరింది” … Read more

Narendra Modi: నైజీరియా చేరుకున్న మోదీ..

ప్రధాని నరేంద్ర మోదీ నైజీరియాకు చేరుకున్నారు. నైజీరియాలో మోదీ పర్యటిస్తుండటం ఇదే తొలిసారి. ప్రధాని రాక నేపథ్యంలో అక్కడ సందడి నెలకొంది. నైజీరియాలో నివసిస్తున్న భారతీయులు పెద్ద సంఖ్యలో అబుజా ఎయిర్ పోర్టుకు చేరుకుని మోదీకి ఆహ్వానం పలికారు. భారత్ మాతాకీ జై, వందేమాతరం నినాదాలతో హోరెత్తిస్తూ ప్రధానికి ఘన స్వాగతం పలికారు. వారికి కరచాలనం చేస్తూ ప్రధాని ముందుకు సాగారు. మరోవైపు ఎక్స్ వేదికగా మోదీ స్పందిస్తూ… నైజీరియాలోని భారతీయ కమ్యూనిటీ ఇంత ఆత్మీయంగా, ఉత్సాహభరితంగా … Read more

Google AI: హోంవర్క్ కోసం ప్రశ్నిస్తే చచ్చిపొమ్మని చెప్పిన గూగుల్ ఏఐ..

ఏమి రా? బాలరాజు నీ వల్ల ఈ దేశానికి ఉపయోగం అన్న మాట పూరీ జగన్నాథ్ సినిమాలో ఒక ఫేమస్ డైలాగ్ ఉంది. గూగల్ ఏఐ కూడా ఒక వ్యక్తికి ఇదే డైలాగ్ చెప్పింది. హోంవర్క్ కోసమని గూగుల్ ఛాట్ బోట్ ను ఆశ్రయించిన ఓ విద్యార్థికి షాకింగ్ అనుభవం ఎదురైంది. తన హోంవర్క్ కు అవసరమైన సలహాలు ఇవ్వకపోగా ‘నువ్వు భూమికి బరువు.. ప్లీజ్ నువ్వు చచ్చిపో ప్లీజ్’ అంటూ గూగుల్ ఛాట్ బోట్ జవాబిచ్చింది. … Read more

Sanju Samson: క్రికెట్లో సంజూ శాంసన్.. సంచలన రికార్డు..

భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జోహన్నెస్‌బర్గ్ వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన 4వ టీ20 మ్యాచ్‌లో ఓపెనర్ సంజూ శాంసన్, తిలక్ వర్మ కీలక పాత్ర పోషించారు. ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి ఇద్దరూ శతకాలు నమోదు చేశారు. ఈ సిరీస్‌లో ఇద్దరికీ ఇవి రెండవ సెంచరీలు కావడం గమనార్హం. ఈ మ్యాచ్ లో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో కేవలం ఒక వికెట్ … Read more

Uttar Pradesh: అగ్నికి ఆహుతైన 10 మంది చిన్నారులు.. యూపీలో దారుణం

ఆస్పత్రులో అగ్ని ప్రమాదాలు, చిన్నారుల దారుణ మరణాలకు ఉత్రరప్రదేశ్ కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఎందుకు వరుసగా ఈ ఘోరాలు జరుగుతున్నాయో తెలియని పరిస్థితి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో శుక్రవారం రాత్రి మరో విషాదం చోటుచేసుకుంది. ఝాన్సీ నగరంలోని మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీలో ఎన్ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. భారీగా మంటలు చెలరేగాయి. శుక్రవారం రాత్రి 10.35 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఏకంగా 10 మంది చిన్నారులు మృత్యువాతపడ్డారు. … Read more

RBI: రూ.2 వేల నోట్లపై ఆర్బీఐ తాజా ప్రకటన

దేశంలో రూ.2వేల నోట్లను 2023 మే 19న ఉపసంహరించినట్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్బీఐ ప్రకటన చేసే నాటికి దేశంలో 3.56లక్షల కోట్ల విలువైన 2వేల రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయి. ఆర్బీఐ ప్రకటన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రజలు, సంస్థలు, ప్రముఖులు వారి వద్ద ఉన్న రూ.2వేల నోట్లను బ్యాంక్‌లలో డిపాజిట్ లేదా ఎక్చేంజ్ చేసుకున్నారు. అక్టోబర్ 7, 2023 వరకూ అన్ని బ్యాంకు బ్రాంచ్‌ల్లో రూ.2వేల నోట్లను … Read more

MK Stalin: హీరో విజయ్ పొలిటికల్ వ్యాఖ్యలపై సీఎం స్టాలిన్ ఏమన్నారంటే

తమిళ హీరో విజయ్ ఇటీవల పాలిటిక్స్ లోకి ఎంటరైన విషయం తెలిసిందే. TVK(Tamila Vetri Klagam)తమిళ వెట్రి కళగం పార్టీని ప్రకటించి తొలిసారిగా బహిరంగ సభ నిర్వహించారు.  అక్కడి అధికార డీఎంకే పార్టీపై విజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డీఎంకే పార్టీని, ఇతర మతతత్వ పార్టీని తమ రాజకీయ ప్రత్యర్థులుగా ప్రకటించారు. విజయ్ వ్యాఖ్యలపై తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ స్పందించారు.  తన సొంత నియోజకవర్గం కొళత్తూరులో అనితా అచీవర్స్ అకాడమీ తరఫున సంక్షేమ ఉపకరణాల … Read more

Udhayanidhi stalin: హిందీకి వ్యతిరేకంకాదు.. మామీద రుద్దిదేనే సమస్య.. ఉదయనిధి స్టాలిన్

తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రాంతీయ భాషల రక్షణపై కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీ భాషకు తమిళనాడు వ్యతిరేకం కాదని దాన్ని బలవంతంగా  రుద్దడానికి మాత్రమే వ్యతిరేకమని చెప్పుకొచ్చారు. మనోరమ డెయిలీ గ్రూప్ నిర్వహించిన ఆర్ట్ అండ్ లిటరేచర్ ఫెస్టివల్ లో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. బలవంతంగా భాషను రుద్దడానికి వ్యతిరేకంగా పుట్టుకొచ్చినవే ద్రవిడ ఉద్యమాలు అని చెప్పారు.  దక్షిణాది తరహాలో ఉత్తరాది రాష్ట్రాల్లో సినీ పరిశ్రమలు లేకపోవడం పెద్ద మైనస్‌గా పేర్కొన్నారు. ఒక వేళ … Read more

Yogi Adityanath: యోగిని చంపేస్తాం అంటూ బెదిరింపు కాల్

పది రోజుల్లోగా యోగి తన పదవికి రాజీనామా చేయాలి,  లేదంటే బాబా సిద్దిఖీ లాగా  చనిపోతాడని ఓ వ్యక్తి ముంబై పోలీసులకు బెదింపు కాల్ చేశాడు.  ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తామంటూ  ముంబై ట్రాఫిక్ పోలీసుల హెల్ప్ లైన్ సెంటర్ కు శనివారం సాయంత్రం ఓ వ్యక్తి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు  ఆరా తీస్తున్నారు. బెదిరింపులకు పాల్పడ్డ ఆగంతకుడిని పట్టుకునేందుకు దర్యాఫ్తు ప్రారంభించారు. మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ … Read more