Mudra Loans: రూ.20 లక్షల వరకు ముద్రా రుణాలు

ఔత్సహిక చిన్న తరహా పరిశ్రమలు పెట్టాలనుకునే వారికి   కేంద్రం మరోమారు శుభ వార్త చెప్పింది .   ముద్రా రుణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రుణాల పరిమితిని ప్రస్తుత రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతూ తాజాగా  నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇప్పటికే ముద్రా రుణాలు తీసుకుని వాటిని సక్రమంగా చెల్లించిన వారికి మాత్రమే ‘తరుణ్‌ ప్లస్‌’ పేరుతో ఈ రుణాలు మంజూరు చేస్తారు. దీంతో చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని భావిస్తున్నారు. ముద్రా రుణాల గరిష్ఠ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచబోతున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ ఏడాది జూలైలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ప్రకటించిన సంగతి తెలిసిందే. పెంచిన ఈ రుణాల చెల్లింపునకు మైక్రో యూనిట్స్‌ పరపతి హామీ నిధి (సీజీఎ్‌ఫఎంయూ) ప్రభుత్వం హామీ ఇస్తుంది.