”అన్య మతస్తులు , హిందూ ధర్మంపై నమ్మకంలేని వారికి దేవాలయ ప్రవేశం ఎందుకు ? ” అని ప్రశ్నించింది మద్రాస్ హైకోర్టు . అన్య మతస్తులు హిందూ దేవాలయాలలోకి ప్రవేశించాలంటే తప్పని సరిగా డిక్లరేషన్ ఇచ్చి తీరాలని బెంచ్ విస్పష్ట తీర్పు ఇచ్చింది . ఈ సందర్బంగా మద్రాస్ హైకోర్టు ”హిందూ దేవాలయాలు పిక్నిక్ స్పాట్స్ కాదు . .” అని వ్యాఖ్యానించింది . అవి పవిత్రకు నిలయాలు అని ధర్మాసనం పేర్కొంది .
తమిళనాడులోని ప్రసిద్ధిచెందిన అరుళ్మిగు పాలని దండాయుత పాణి స్వామి ఆలయం , దాని ఉప ఆలయంలోకి కేవలం హిందువులను మాత్రమే అనుమతించాలంటూ దానికోసం ప్రతివాదులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ డి . సెంథిల్ కుమార్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేసారు . ఈ పిటిషన్ విచారించిన మద్రాస్ హైకోర్టు అన్య మతస్తులకు దేవాలయాలలోకి ప్రవేశం లేదని స్పష్టమైన తీర్పు ఇచ్చింది .