Uttarakhand : చేప అనుకుని చనిపోయిన పామును ఇద్దరు చిన్నారులు కాల్చుకుని తిన్నారు. ఈ ఘటన ఉత్తరాఖండ్ (Uttarakhand) లో చోటు చేసుకుంది. వెంటనే గమనించిన చిన్నారుల తల్లి వారిని హుటాహుటిన పాముల (Snakes ) సంరక్షుడి వద్దకు తీసుకెళ్లింది. అయితే పాము విషపూరితమైనది కాకపోవడంతో చిన్నారుల ప్రాణాలకు ముప్పు తప్పింది.
నైనితాల్ జిల్లా (Nainithal District) పుచ్చడినాయి గ్రామంలో ఓ కుటుంబం ప్లాస్టిక్ వ్యర్తాలను సేకరిస్తూ జీవిస్తున్నారు. ఆ కుటుంబానికి చెందిన 8 మరియు 10 ఏళ్ల చిన్నారులు చనిపోయిన పామును చేప అని భావించి కాల్చుకుని తిన్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన తల్లి వెంటనే గమనించి పామును దూరంగా విసిరేసింది. అనంతరం చిన్నారులను పాముల సంరక్షుడి వద్దకు తీసుకెళ్లడంతో.. ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే చిన్నారులు పాము తలను తినకపోవడంతో ప్రమాదం తప్పిందని సంరక్షుడు చెప్పారు. ఈ క్రమంలోనే పాములు ఎక్కడైనా కనిపిస్తే చంపొద్దని, అటవీశాఖ అధికారుల ( Forest Officials) కు తెలియజేయాలని సూచిస్తున్నారు.