కేంద్ర ప్రభుత్వం కీలక విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. హైవేలపై వాహనదారులు, ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంది. పరిశుభ్రమైన టాయిలెట్లు, బేబీ కేర్ రూమ్‌లతో పాటు మరిన్ని సౌలభ్యాలు కల్పిస్తూ ‘హమ్‌సఫర్ పాలసీ’ని ఆవిష్కరించింది. దానిని కేంద్ర రోడ్డు రవాణా, రహదారులశాఖ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఈ పాలసీని మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ హమ్‌సఫర్ బ్రాండ్ దేశ హైవే నెట్‌వర్క్‌లో ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందిస్తుందన్నారు. ప్రయాణికులు, డ్రైవర్లకు మంచి భద్రత కల్పిస్తుందని చెప్పారు. హైవే నెట్వర్క్ అంతటా మెరుగైన సౌకర్యాలను అందించేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
పాలసీలో సౌకర్యాలు..
ఈ హమ్‌సఫర్ పాలసీలో హైవేల వెంబడి టాయిలెట్లు, బేబీకేర్ రూమ్‌లు, దివ్యాంగులకు వీల్చైర్లు, ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, పార్కింగ్ స్థలాలు, ఇంధన ఫిల్లింగ్ కేంద్రాల్లో డార్మిటరీ సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ విధానంలో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి.