అంచనాలు తప్పాయ్.. హర్యానా బీజేపీ ఖాతాలోకే ..

”ఎన్నికల విశ్లేషకులు ,  కీలకమైన జాతీయ స్థాయి సర్వేలు సైతం … హర్యానాను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ఘంటాపధంగా చెప్పాయి .  అయితే ఆ సర్వేల అంచనాలన్నీ తలకిందులయ్యాయి . ” ఆ రాష్ట్రంలో మూడోసారి బీజేపీ గెలుపొంది హ్యాట్రిక్ సాధించింది .

భారతీయ జనతాపార్టీ హర్యానాలో 48 అసెంబ్లీ సీట్లను గెలుచుకుని అధికారం దక్కించుకుంది .  మొత్తం 90 స్థానాలకుగాను . . కాంగ్రెస్ కి 37 సీట్లు మాత్రమే దక్కాయి . ఐఎన్ ఎల్ డి 2 స్థానాలలో ,  స్వతంత్రులు 3 చోట్ల గెలుపొందారు .

బీజేపీకి 39.94 శాతం ఓట్లు రాగా , , కాంగ్రెస్ కి 39.09 శాతం ఓట్లు వచ్చాయి .  రెండు పార్టీల మధ్య తేడా . .0.85 శాతం మాత్రమే .  అయినా . . 11 సీట్లలో గెలుపు ఓటమి మారిపోయాయి .  అయితే ఈ ఎన్నికలలో ప్రాంతీయ పార్టీల ప్రభావం ఏ మాత్రం కనిపించలేదు .