central govt announce flood relief:కేంద్రం భారీ సాయం – తెలుగు రాష్ట్రాలకు రూ.3,300 కోట్లు

Central Government Help : భారీ వర్షాలు, వరదలతో  తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి .  తెలంగాణ ,  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో జరిగిన వరద నష్టానికి కేంద్రం ఉదారంగా వ్యవహరించి . . భారీ సాయం ప్రకటించింది .   ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కలిపి రూ.3,300 కోట్లు విడుదల చేసింది. తక్షణ సహాయక చర్యల కోసం ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు  ప్రకటించింది. ఇప్పటికే కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌తో పాటు, కేంద్ర బృందం తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి వరదల కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించింది.

 ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ఏపీ, తెలంగాణకు పూర్తి సహకారం అందజేయనున్నట్లు కేంద్రం X ద్వారా  తెలిపింది. వరద ప్రాంతాలకు ఇప్పటికే నిపుణుల బృందం పంపామని, వరదలు, డ్యామ్‌లు, వాటి భద్రతను ఆ బృందం పరిశీలిస్తుందని వెల్లడించింది. వరద నష్టం అంచనాకు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఏపీలో 26 ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, 8 వైమానికదళ హెలికాప్టర్లు ఉన్నాయని హోంశాఖ స్పష్టం చేసింది. ఏపీలో 3 నౌకాదళ హెలికాప్టర్లు, డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఉన్నాయని తెలిపింది. ఇప్పటివరకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఏపీలో 350 మందిని రక్షించినట్లు, 15 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించింది.