ఇకపై సిమ్ కార్డు లేకుండానే ఫోన్ చేసుకోవచ్చు. అంతే కాదు టవర్లు, నెట్ వర్కు బాధలు కూడా ఉండవు. ఈ టెక్నాలజీలో బీఎస్ఎన్ఎల్ పెను సంచలనం సృష్టించబోతోంది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌కు బీఎస్ఎన్ఎల్ మాస్టర్ స్ట్రోక్ ఇవ్వబోతోంది. గ్లోబల్ శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థ ‘వియాసత్’తో కలిసి ‘డైరెక్ట్ టు డివైజ్ (DtoD) సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ట్రయల్స్ కూడా పూర్తిచేసుకుంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లు ఇద్దరికీ ఇది అందుబాటులోకి రానుంది. స్మార్ట్ వాచ్‌తోపాటు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర స్మార్ట్ డివైజ్‌లకు కూడా ఇది సపోర్ట్ చేస్తుంది.
డైరెక్ట్ టు డివైజ్ సాంకేతికతతో సిమ్‌కార్డు లేకుండానే మొబైల్ ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, కార్ల యజమానులు కూడా నేరుగా శాటిలైట్ నెట్‌వర్క్‌తో అనుసంధానం కావొచ్చు. పర్సనల్, డివైజ్ కమ్యూనికేషన్‌కు సపోర్ట్ చేసేలా దీనిని డిజైన్ చేశారు. ఎక్కడున్నామన్న దానితో సంబంధం లేకుండా ఇది నిరంతర కనెక్టివిటీని అందిస్తుంది. మారుమూల ప్రాంతాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.