భారత్ అంబుల పొడిలో మరో రామబాణం వచ్చి చేరింది . ”ఒడిశా తీరంలోని డాక్టర్ APJ అబ్దుల్ కలాం ద్వీపం నుంచి, లాంగ్ రేంజ్ హైపర్‌సోని క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడం ద్వారా భారతదేశం ఒక ప్రధాన మైలురాయిని సాధించింది” అని రక్షణ మంత్రి X ద్వారా తెలిపారు .
“ఇది ఒక చారిత్రాత్మక క్షణం. ఈ ముఖ్యమైన విజయం. అలాంటి క్లిష్టమైన, అధునాతన సైనిక సాంకేతికతలను కలిగి ఉన్న, దేశాల సమూహంలో మన దేశం కూడా చేరింది” అని ఆయన అన్నారు.ధ్వని కంటే వేగవంతం. గాలిలోనే లక్ష్యాన్ని మార్చుకోగలదు:
– హైపర్‌సోనిక్ క్షిపణి ఆధునిక యుద్ధంలో అత్యంత అధునాతన సాంకేతికతలలో ఒకటి.
– ఇది ధ్వని వేగం కంటే 5 నుండి 25 రెట్లు లేదా గంటకు 6,200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.
– దీని ముఖ్య లక్షణం యుక్తి. దీని కారణంగా ఈ క్షిపణి తన మార్గంలో వెళ్తూ.. లక్ష్యం, దిశను మార్చుకోగలదు. అందువల్ల ఇది ఎటు వెళ్తుందో శత్రువులకు అంతుచిక్కదు. ఈ కారణంగా శత్రువులు దీన్ని కూల్చడం కష్టం.
– ఇది, సంప్రదాయ బాలిస్టిక్ క్షిపణుల కంటే తక్కువ ఎత్తులో ప్రయాణించగల సామర్థ్యం కలిగివుంది. ఈ కారణంగా హైపర్‌సోనిక్ క్షిపణులను ట్రాక్ చేయడం, అడ్డుకోవడం చాలా కష్టతరం. ప్రపంచంలో అరుదైన పరీక్ష ఇది అని పలువురు సైటిస్ట్లు కొనియాడారు .