విరాట్ రెండో టెస్టులో బరిలోకి దిగుతాడా? లేదా? అని భారత్ క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం ప్రాక్టిస్ లో విరాట్ కాలికి బ్యాండేజీతో కనిపించడంమే.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఐదు మ్యాచుల బీజీటీ సిరీస్‌లో రెండో టెస్టు ఈ నెల 6 నుంచి అడిలైడ్ ఓవల్ వేదికగా ప్రారంభం కానుంది. దీనికోసం ఇప్పటికే టీమిండియా అడిలైడ్‌కు చేరుకుంది. భారత క్రికెటర్లు ప్రాక్టీస్ కూడా మొదలెట్లారు.
మన స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ప్రాక్టిస్ ల కాలికి బ్యాండేజీతో కనిపించడం ఇప్పుడు అందరినీ కలవర పెడుతోంది. బ్యాండేజీతో ఉన్న అతడి ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో విరాట్ రెండో టెస్టులో బరిలోకి దిగుతాడా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.
ఇక ప్రాక్టీస్ సెషన్‌లో కోహ్లీ కుడి కాలి మోకాలి నొప్పితో ఇబ్బంది పడగా.. మెడికల్ టీమ్ వచ్చి చికిత్స చేసి మోకాలికి బ్యాండేజీ వేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ రెండో టెస్టుకు రన్‌మెషిన్ దూరమైతే మాత్రం అది భారత జట్టుకు పెద్ద దెబ్బనే చెప్పాలి. ఎందుకంటే అడిలైడ్ మైదానంలో కోహ్లీ అద్భుతమైన రికార్డు సాధించాడు.
అక్కడ ఆడిన నాలుగు టెస్టు మ్యాచుల్లోను ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 509 రన్స్ చేశాడు. ఇక 2014లో జరిగిన టెస్టులోనైతే రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా సెంచరీలు కొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 115 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 141 రన్స్ చేశాడు. దీనిపై అభిమానుల్లో సస్పెన్స్ వీడాల్సి ఉంది.