తీవ్ర కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్ కు శస్త్రచికిత్స (operation) పూర్తయినట్లు తెలుస్తోంది. ఇవాళ (మంగళవారం) ఉదయం వైద్యులు ఆయన పొత్తికడుపులో స్టెంట్ వేసినట్లు సమాచారం. ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉంది (Rajinikanth health update). మరో మూడు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ (Discharge) ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మరోవైపు రజనీ ఆరోగ్యంపై ఆయన భార్య లతా (Latha) స్పందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. రజనీకాంత్ ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు రావడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన క్షేమంగా ఉన్నారని తెలియడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన కోలుకోవాలని ప్రార్థిస్తూ పోస్ట్లు పెడుతున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ ‘వేట్టయాన్’, ‘కూలీ’ సినిమాల్లో నటిస్తున్నారు. ‘వేట్టయాన్’ అక్టోబర్ 10న విడుదల కానుంది. ఇటీవల జరిగిన ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుకలోనూ రజనీ పాల్గొన్నారు. అనిరుధ్ తో కలిసి డ్యాన్స్ వేశారు.