Bollywood Actress – Alia Bhatt: ఆలియా సంపాదన తెలిస్తే షాక్..!

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్, యాక్టింగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు.. అలియా ఫస్ట్ మూవీ సూపర్ హిట్ కావడంతో హిందీలో ఈ అమ్మడుకు ఆఫర్స్ క్యూ కట్టాయి. ఉత్తరాది రాష్ట్రాల్లోనే కాకుండా ఈమెకు ఇటు దక్షిణాదిలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన RRR సినిమాతో సౌత్ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఆలియా.. ప్రస్తుతం జిగ్రా సినిమాతో మరోసారి థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే ఆలియా నెట్‌వర్త్ నెట్టింట బయటికి వచ్చింది. అది కాస్తా ఇప్పుడు అందర్నీ షాకయ్యేలా చేస్తోంది. ఇక ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకునే స్టార్స్‌లలో ఆలియా ఒకరు. ఒక్కో సినిమాకు 15 నుంచి 18 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఇక యాక్టింగ్‌లోనే కాదు.. ఎండార్స్‌మెంట్‌లు, బిజినెస్ వెంచర్‌ల ద్వారా కూడా ఆలియా గట్టిగానే సంపాదిస్తోంది.