Amitabh Bachchan: పుష్ప 2 పై అమితాబ్ ప్రశంసల జల్లు..

ఎక్కడ చూసినా పుష్ప 2 గురించే చర్ఛ నడుస్తోంది. అందరికీ చేరువైన సినిమా అది. చాలా కాలంగా సరైన హిట్ లేకపోవడంతో ఈ మూవీ జనాలకు బాగా కనెక్టయింది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలు పుష్ప 2 మూవీకి బాగా ఎడిక్ట్ అయ్యారనేది వాస్తవం. హాళ్ల లో వస్తున్న రియాక్షన్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా నార్త్ ఇండియా జనాలకు బాగా కిక్ ఇవ్వడం గమనించాల్సిన పాయింట్. ముఖ్యంగా బిహార్ ప్రాంత అభిమానుల రికాక్షన్ చూస్తే అవాక్కవ్వలసిన పరిస్థితి.

అందుకే బాలీవుడ్ బొనాంజా అమితాబచ్చన్ అల్లుఅర్జున్ ను ప్రత్యేకంగా అభినందించారు. ప్రశంసల జల్లు కురిపించారు. బన్నీ పనితీరుకు, ప్రతిభకు తాను అభిమానినంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన గురించి అల్లు అర్జున్ మాట్లాడిన వీడియోను షేర్ చేస్తూ అమితాబ్ కృతజ్ఞతలు తెలిపారు. ‘కృతజ్ఞతలు అల్లు అర్జున్‌.. నిజం చెప్పాలంటే నేను నీ ప్రతిభకు, నీ పనితీరుకు పెద్ద అభిమానిని. నువ్వు ఇలానే ఎంతోమందికి స్ఫూర్తినిస్తూ ఉండాలి. ఇలాంటి హిట్‌లు ఎన్నో అందుకోవాలని కోరుకుంటున్నా. శుభాకాంక్షలు’ అని అమితాబ్ బచ్చన్ పేర్కొనడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవల పుష్ప 2 సినిమా ప్రమోషన్లలో భాగంగా ముంబైలో అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ అమితాబ్ సూపర్ హీరో అని, ఆయన సినిమాలు చూస్తూ పెరిగానని చెప్పారు. బిగ్ బీ అంటే తనకెంతో ఇష్టమని చెప్పాడు. ఎన్నో సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉంటూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారంటూ చెప్పాడు. దానిపైనే అమితాబ్ స్పందించారు. ‘మాకందరికీ మీరు సూపర్ హీరో.. మీ నుంచి ప్రశంసలు అందుకోవడం నమ్మలేకపోతున్నా.. మీ ప్రేమకు ధన్యవాదాలు’ అంటూ అర్జున్ రిప్లయ్ ఇచ్చాడు. దీనిపై సర్వత్రా చర్చ సాగుతోంది.