చెన్నైతో ఉన్న ఆ అనుబంధమే వేరు. తాను ఏం సాధించినా అది చెన్నైకే అంకితం అని అల్లు అర్జున్ అన్నారు. అల్లు అర్జున్, రష్మిక హీరో హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప 2 ది రూల్ డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం చెన్నైలోని లియో ముత్తు ఇండోర్ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించింది. అల్లు అర్జున్, రష్మిక, శ్రీలీల, కోలీవుడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
అల్లు అర్జున్ తన కెరీర్‌కు సంబంధించి అనేక కీలక విషయాలను పంచుకున్నారు. చెన్నై వస్తే ఆ అనుభూతే వేరుగా ఉంటుందన్నారు. ఈ నేలతో తనకు అంత అనుబంధం ఉందన్నారు. తన జీవితంలో తొలి 20 సంవత్సరాలు చెన్నైలోనే గడిచాయని చెప్పారు. తాను ఏమి సాధించినా అదంతా చెన్నైకే అంకితమని అల్లు అర్జున్ ప్రకటించారు.