- రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ లో ‘గేమ్ ఛేంజర్’
- నాలుగో సాంగ్ విడుదలపై తమన్ అప్డేట్
- గేమ్ ఛేంజర్ ఇక సౌండ్ ఛేంజర్ అంటూ ట్వీట్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు శంకర్ కాంబోలో వస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఇప్పటికి ఈ సినిమా నుంచి మూడు పాటలు విడుదల కాగా తాజాగా నాలుగో పాటపై సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ సాంగ్ గేమ్ ఛేంజర్ ను సౌండ్ ఛేంజర్ గా మారుస్తుందంటూ ట్విట్టర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
DHOP అంటూ సాగే ఈ పాట ఇవాళ సాయంత్రం విడుదుల కానుందన్న తమన్ యావత్ ప్రపంచమంతా ఈ సాంగ్ గురించి మాట్లాడుకుంటుందని తెలిపారు. అయితే ఈ మూవీ నుంచి రిలీజైన జరగండి, రా మచ్చా, నానా హైరానా సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయన్న సంగతి తెలిసిందే. దీంతో నాలుగో సాంగ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తుండగా.. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు.