WhatsApp New Feature: వీడియో కాల్‌ మాట్లాడుతున్న సమయంలో మీ మూడ్‌కు తగ్గట్లుగా బ్యాక్‌గ్రౌండ్‌ సెట్‌..!

WhatsApp New Feature: ఇకపై వీడియో కాల్‌ (Video Call) మాట్లాడుతున్న సమయంలో మీ మూడ్‌కు తగ్గట్లుగా బ్యాక్‌గ్రౌండ్‌ (Background) సెట్‌ చేసుకోవచ్చు. అవునండీ .. ఈ విషయాన్ని మెటా సీఈఓ స్వయంగా తెలిపారు (Meta CEO).

వీడియో కాల్‌ అనుభవాన్ని మెరుగుపరచడానికి వాట్సప్‌ సరికొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. తన ప్లాట్‌ఫామ్‌ను ఆల్‌-ఇన్‌-వన్‌గా రూపుదిద్దేందుకు ప్రయత్నిస్తోన్న వాట్సాప్‌ సరికొత్త ఫీచర్లు జోడిస్తోంది. ఇప్పటికే యూజర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని పలు ఫీచర్లను తీసుకొచ్చింది. వీడియో కాల్‌ సమయంలో కస్టమర్లకు మెరుగైన అనుభవాన్ని అందించేందుకు సరికొత్త సదుపాయాల్ని అందుబాటులోకి తెస్తోంది. వీడియోకాల్‌ సమయంలో నచ్చినట్లుగా స్క్రీన్‌ను మార్చుకొనే సదుపాయం రానుంది. అంటే వీడియో కాల్‌ సమయంలో ఫిల్టర్‌లు, బ్యాక్‌గ్రౌండ్‌లో నచ్చిన థీమ్‌ను (Theme) సెట్‌ చేసుకోవచ్చు. మీ స్నేహితులు, కుటుంబసభ్యులతో వీడియో కాల్‌ మాట్లాడుతున్న సమయంలో మీ మూడ్‌కు తగ్గట్లుగా బ్యాక్‌గ్రౌండ్‌ సెట్‌ చేసుకోవచ్చన్నమాట. ఉదాహరణకు.. మీరు వీడియోకాల్‌లో ఉంటే బ్యాక్‌గ్రౌండ్‌ని టెంపుల్ లా  లేదా మీరు రద్దీ కెఫే లో లో ఉన్నట్లు మార్చేయొచ్చు.