Vineshphogat: వినేష్ ఫోగట్ రాద్ధాంతం… కాంగ్రెస్ వాకౌట్

 (రచయిత పొట్లూరి పార్థసారధి) :   ఇటాలియన్ మహిళా రెజ్లర్ ఎక్కువ బరువు ఉన్న కారణంగా ఒలింపిక్స్ క్రీడల్లో అనర్హత వేటు పడింది!

ఇటలీ కి చెందిన మహిళా రెజ్లర్ ఇమాన్యులా లెజ్జి (Emanuela Liuzzi) పరిమితికి కి మించిన బరువు ఉన్న కారణంగా ఒలింపిక్స్ రెజ్లింగ్ పోటీ నుండి తప్పుకోవాల్సి వచ్చింది!

Rule is Rule for every one.

50 kg ల విభాగంలో పోటీలో పాల్గొనే వారికి 2 kg ఎక్కువ ఉన్నా అనుమతి ఇస్తారు అంటే ఖచ్చితంగా 50 కిలోలు బరువు మాత్రమే ఉండాలి అని చూడరు.

 2 kg కంటే ఎక్కువ బరువు ఉంటే అనగా 50 కిలోల విభాగంలో 52 kg ల వరకూ అనుమతి ఇస్తారు!

ఫైనల్ మ్యాచ్ కి ముందు రెండు సార్లు బరువు ఎంత ఉన్నదీ చెక్ చేస్తారు అది రూల్!

ఫైనల్ మ్యాచ్ కి ముందు వినేష్ ఫొగట్ బరువు 52 కిలోల 150 గ్రాములు ఉంది అంటే 150 గ్రాములు ఎక్కువగా ఉంది కాబట్టి డిస్ క్వాలిఫై అయింది!

50 కిలోల విభాగంలో 2 కిలోల అదనపు మినహాయింపు ఇస్తారు అంటే బరువు 50+2 kg కంటే ఎక్కువగా ఉండకూడదు అన్నమాట!

ఫోగట్ 52.15 kg లుగా నమోదు అయ్యింది!

**********************

వినేష్ ఫోగట్ ఆడింది ఆట పాడింది పాట!

1.వినేష్ ఫోగట్ ఈ ఒలంపిక్స్ కి ముందు అన్ని పోటీలలో 53 kg రెజ్లింగ్ విభాగంలో పాల్గొంటూ వచ్చింది!

2. 53 kg రెజ్లింగ్ విభాగంలో ప్రపంచంలో ఉన్న బెస్ట్ రె జ్లర్స్ పోటీలో ఉంటారు!

3. 53 kg విభాగంలో తాను ఈ సారి మెడల్ సాధించలేనని కాబట్టి తనని 50 కేజీ విభాగంలో పోటీకి అనుమతి ఇవ్వమని భారత్ రెజ్లింగ్ సమాఖ్య ( Indian Wrestling Council – IWC) కి విజ్ఞప్తి చేసింది. IWC అనుమతి ఇచ్చింది పోనీలే ఏదో ఒక విభాగంలో ఒక 🥇 మెడల్ అన్న వస్తుంది అనే ఆశతో!

భారత ప్రభుత్వం తొ పాటు భారత ఒలింపిక్ సమాఖ్య కూడ ఫోగట్ అడిగినవి అన్నీ ఇచ్చి సహకరించింది!

4. తనకి విదేశీ కోచ్ కావాలి అదీ తన ఒక్కదానికే కోచింగ్ ఇవ్వాలి అని అడిగితే ఇచ్చారు!

5. తనకి ట్రైనింగ్ కోసం హంగరీ దేశ రాజధాని బుడాపెస్ట్ లో వసతి కావాలి అంటే అదీ ఇచ్చారు.

6.40 రోజుల పాటు తనకి ప్రత్యేకముగా డైటీషియన్ కావాలి అదీ విదేశీ అని అడిగితే తన ఇష్టం మేరకు తాను కోరుకున్న డైటీషియన్ ను సమకూర్చారు!

7. అడిగినవీ అన్నీ ఇచ్చి బుడాపెస్ట్ లో 40 రోజుల పాటు శిక్షణ తీసుకొని వచ్చింది పారిస్ ఒలంపిక్స్ కి.

Athletes are responsible for their weight !

వినేష్ ఫొగట్ ఏమన్నా మొదటిసారిగా రెజ్లింగ్ పోటీలలో పాల్గొంటున్నదా?

బరువు ఎంత ఉందో చూసుకోకుండానే ఆ రోజు పోటీకి సిద్ధమయ్యిందా?

ఉండాల్సిన దానికంటే 150 గ్రాములు ఎక్కువగా ఉంది అని తెలిసే పోటీకి వచ్చి అనుమతి ఇవ్వలేదని ఫౌల్ క్రై ఏడ్పులు!

ఇటాలియన్ మహిళా రెజ్లర్ తాను బరువు ఎక్కువగా ఉన్న కారణంగా ఒలింపిక్స్ నుండి మౌనంగా వెళ్ళిపోయింది తప్పితే ఎవరినీ నిందించలేదు!

ఎందుకంటే బరువు ను నియంత్రించుకోవాల్సింది క్రీడాకారులే కానీ ప్రభుత్వాలు ఆ పని చేయలేవు!

వేల డాలర్లు ఖర్చు పెట్టీ నియమించుకున్న కోచ్ ఏం చేస్తున్నాడు బరువు విషయంలో?

వేల డాలర్లు ఖర్చు పెట్టీ నియమించుకొన్న ఆహార నిపుణుడు ఏం చేశాడు బరువు పెరుగుతుంటే?

దీనికోసం ప్రత్యేకంగా కాంగ్రెస్, సమాజ్వాది పార్టీలు పార్లమెంట్ నుండి వాక్ అవుట్ చేయాలా?

కుచ్ భీ! ప్రకాష్ రాజ్ దిక్కుమాలిన కార్టూన్ తో దుష్ప్రచారం దేనికి?

నాకు తెలిసీ అడుగుతున్నా!

పేరుగొప్ప పత్రికలకి స్పోర్ట్స్ కాలమ్ వ్రాసే జర్నలిస్టులు ప్రత్యేకముగా ఉంటారు కానీ ఇవేవీ వాళ్ళకి తెలియవా?

మరి వినేష్ ఫోగట్ ఎందుకు రాద్ధాంతం చేస్తున్నది?