Uppal Stadium: భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్‌ను అడ్డుకుంటాం.. వీహెచ్‌పీ హెచ్చరిక

హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో  భారత్-బంగ్లాదేశ్ ట్వంటీ 20 మ్యాచ్‌ జరగనున్న విషయం తెలిసిందే. అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఇంటర్ నేషనల్ మ్యాచ్ ను వీక్షించడానికి ప్రపంచ వ్యాప్తం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ ను జరగనివ్వం అంటే విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) హెచ్చరిక జారీ చేసింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడి నేపథ్యంలో వీహెచ్‌పీ ఈ హెచ్చరిక జారీ చేసింది. భారత్-బంగ్లా మ్యాచ్‌ను అడ్డుకుంటామని ప్రకటించింది.

ఈ  హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు  చేశారు. ట్వంటీ 20 మ్యాచ్ కోసం ఇరుజట్లు ఇప్పటికే భాగ్యనగరానికి చేరుకున్నాయి. ఈ సిరీస్‌లో దూకుడుగా ఉన్న భారత్ మ్యాచ్‌ను క్లీన్ స్వీప్ చేస్తామని ధీమాగా ఉంది. టీమిండియాను కట్టడి చేయాలని బంగ్లా టీమ్ భావిస్తోంది. మరో వైపు ఉప్పల్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులను వర్షం కలవరపెడుతోంది. శనివారం చిన్నపాటి జల్లులు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.