Gautam Adani: అదానీపై లంచం కేసుపై అమెరికా కీలక ప్రకటన

భారతీయ పారిశ్రామికవేత్త గౌతం అడానిపై అమెరికాలో లంచం కేసు నమోదైన సంగతి తెలిసిందే. దానిపై అమెరికా సంచలన ప్రకటన చేసింది. ఈ కేసు విషయంలో అమెరికాతో పాటు భారత్, ప్రపంచ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. భారత్-అమెరికా మధ్య సంబంధాలపై అమెరికా స్పందించింది. తమ మధ్య సంబంధాల విషయంలో ఏమాత్రం రాజీపడకుండా ఈ సమస్యను అధిగమిస్తాయని వైట్ హౌస్ మీడియా సెక్రటరీ కరీన్ జీన్ పియర్ విశ్వాసం వ్యక్తం చేశారు. అడానీ గ్రూప్‌పై ఆరోపణల విషయం తమ దృష్టికి … Read more

Adani: అదానీ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అదానీ గ్రూప్ పై అమెరికాలో కేసుతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు మన మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 10.50 గంటల సమయంలో సెన్సెక్స్ 580 పాయింట్ల నష్టంతో 77,008 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 205 పాయింట్లు పతనమై 23,314 వద్ద కొనసాగుతోంది.  అదానీ పోర్ట్స్ షేరు విలువ 20 శాతం పతనమయింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4.04 శాతం, ఇండస్ ఇండ్ … Read more

USA: మీటింగ్ కి డుమ్మా . . 99 మంది ఉద్యోగుల్ని తొలగించిన అమెరికా కంపెనీ..

కంపెనీ ఏర్పాటు చేసే మీటింగ్ కి డుమ్మా కొడితే . . మన దేశంలో అయితే మహా అయితే వార్ని0గ్ ఇస్తారు. ఇంకా సీరియస్ గా ఉండే బాసులైతే ఇంక్రిమెంట్ కట్ చేస్తామనో, బెనిఫిట్స్ కటింగ్ అనో చిన్న చిన్న పనిష్మెంట్స్ ఉంటాయి . అమెరికాలో ఓ కంపెనీ సిఈవో మాత్రం ఏకంగా ఒకేసారి 99 మంది ఉద్యోగులను సమావేశానికి హాజరుకాలేదన్న ఒకే ఒక కారణంతో తొలగించడం హాట్ టాపిక్ . మార్నింగ్ సమావేశానికి హాజరు కాలేదని … Read more

అమెరికాలో భారీగా ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు

అనవసర ఖర్చులు తగ్గించేందుకు బడ్జెట్‌లో కోతలు విధించడమే ప్రథమ లక్ష్యమని ప్రకటించిన అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇది వరకే తన విధానాన్ని సుస్పష్టం చేసారు . ట్రంప్ ఆలోచనలను కార్యరూపంలోకి తెచ్చేందుకు యూఎస్ లో కసరత్తు మొదలైంది. దీని కోసం ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌; భారత సంతతికి చెందిన బయోటెక్‌ కంపెనీ సీఈవో, రిపబ్లికన్‌ పార్టీ నాయకుడు వివేక్‌ రామస్వామి ఉమ్మడి ఆధ్వర్యంలో ప్రభుత్వ సామర్థ్య విభాగం  ప్రత్యేకంగా ఏర్పాటు … Read more

మిస్ యూనివర్శ్‌గా డెన్మార్క్ యువతి..

విక్టోరియాని వరించిన అందాల కిరీటం డెన్మార్క్ అందాల పోటీలలో చరిత్ర సృష్టించింది. 73వ మిస్ యూనివర్శ్ 2024 పేజెంట్‌లో ఆ దేశానికి చెందిన 21 ఏళ్ల విక్టోరియా జాయిర్ (Victoria Kjaer)ని అందాల కిరీటం వరించింది. ఇప్పటివరకూ డెన్మార్క్‌కి ఇలాంటి కిరీటం దక్కడం మొదటిసారి . ఈ పోటీలలో మెక్సికోకి చెందిన మర్లా ఫెర్నాండా బెల్ట్రాన్ (Marla Fernanda Beltran) మొదటి రన్నరప్‌గా నిలవగా.. నైజీరియాకి చెందిన స్నిడిమ్మా అడెత్‌షిన్హా (Cnidimma Adetshina) రెండో రన్నరప్ పొజిషన్‌లో … Read more

China: చైనాలో ఎనిమిది మందిని కత్తితో పొడిచిన విద్యార్థి

చైనాలో ఓ యువకుడు శనివారం ఉన్మాదిగా ప్రవర్తించి ఎనిమిది మంది ప్రాణాలు తీశాడు. మరో 17 మందిని గాయపర్చాడు. ఈ ఘటన చైనా తూర్పు నగరం వుషీలో జరిగింది. 21 సంవత్సరాల యువకుడు కళాశాల క్యాంపస్‌లో కత్తితో వీరంగం సృష్టించాడు. విచక్షణారహితంగా కత్తితో విద్యార్థులపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో  8 మంది మృతి చెందారు. మరో 17 మంది గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు వుషీ  వొకేషనల్ ఇన్‌స్టిట్యూట్ … Read more

ఎలాన్ మస్క్‌కు కీలక పదవి

తాజా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయంలో విశేష కృషి చేసిన ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు కీలక పదవి ఖాయమైంది. అమెరికా ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ’ విభాగానికి ఎలాన్ మస్క్ నాయకత్వం వహిస్తారని అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వివేక్ రామస్వామితో కలిసి ఎలాన్ మస్క్ ఈ విభాగం బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపారు. ‘‘అద్భుతమైన ఈ ఇద్దరు అమెరికన్లు కలిసి మా ప్రభుత్వంలో బ్యూరోక్రసీకి మార్గం చూపుతారు. ‘సేవ్ … Read more

Canada: కెనడాలో హిందూ దేవాలయంపై దాడి

కెనడాలోని బ్రాంప్టన్‌లో హిందూ దేవాలయంలో భక్తులపై ఖలిస్థాన్ మద్దతుదారులు దాడులు చేశారు. ఈ ఘటనపై కెనడాలోని భారతీయుల భద్రతపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.  హిందూ దేవాలయాన్ని, భక్తులను లక్ష్యంగా చేసుకొని జరిగిన దాడిని ఖండిస్తున్నామని భారత విదేశాంగశాఖ అధికారి ప్రతినిధి రణదీర్ జైశ్వాల్ అన్నారు. ఉగ్రవాదులు, వేర్పాటువాదుల హింసాత్మక చర్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి దాడుల నుంచి దేవాలయాలను కాపాడాలని ఆయన కెనడా ప్రభుత్వాన్ని కోరారు. హింసకు పాల్పడిన వారిని తప్పకుండా శిక్షిస్తామని హెచ్చరించారు. … Read more

Canada: కెనడా పార్లమెంట్ బయట ‘ఓం’ జెండా ఎగురవేసిన భారత సంతతి

హిందు కెనడీయన్లు రాజకీయాల్లో పాల్గొనాలి అంటూ కెనడా ఎంపీ చంద్ర ఆర్య పిలుపునిచ్చారు.  అక్కడి పార్లమెంట్ వెలుపల ‘ఓం’ గుర్తు కలిగిన కాషాయ జెండాను ఎగురవేశారు. నవంబర్  లో హిందూ హెరిటేజ్ మాసాన్ని పురస్కరించుకొని ఆయన  మాట్లాడారు. కెనడా రాజకీయ రంగంలో మన ప్రాతినిధ్యం చెప్పుకోదగినంతగా లేదన్నారు. 2022 నుండి హిందూ వారసత్వ మాసంలో చంద్ర ఆర్య హిందూ జెండాను ఎగురవేయడం ఇది మూడోసారి. కెనడాలో హిందూ వారసత్వ మాసాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తుంటారు. హిందూ మతానికి … Read more

భారత్, చైనా సైనికులు.. దీపావళి రోజు ఏంచేశారు ?

సరైన కారణం లేకుండానే అస్తమానూ కయ్యానికి కాలు దువ్వే మన పొరుగుదేశం చైనా . . సరిహద్దు ప్రాంతంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది .  దీపావళి పర్వదినాన ఇరు దేశాల సైనికులు మిఠాయిలు పంచుకుని పరస్పరం అభినందనలు తెలుపుకోవడం విశేషం .   దీపావళి సందర్భంగా వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి పలు సరిహద్దు పాయింట్ల వద్ద భారత, చైనా సైనికులు స్వీట్లు పంచుకున్న అరుదైన ఘటన జరిగింది .  . తూర్పు లద్దాఖ్‌లోని దెప్పాంగ్, దేమ్‌చుక్ … Read more