అంతర్జాతీయ ఇస్లానిక్ ఉగ్రవాది బిన్ లాడెన్ ని మట్టుపెట్టడానికి అమెరికా , దాని మిత్ర దేశాలకు దశాబ్ద కాలం పట్టింది . హమాస్ ని తుదికంటా మట్టుపెట్టడానికి ఇజ్రాయెల్ కి ఒక సంవత్సరం పట్టింది . అక్టోబర్ 7, 2023 న ఇజ్రాయెల్ మీద దాడి చేసి 1258 మంది సాధారణ పౌరులని క్రూరంగా హింసించి చంపి , మరో 250 మందిని బందీలుగా పట్టుకెళ్ళున సంఘటనకి కారకుడు మాస్టర్ మైండ్ హమాస్ ముఖ్య నాయకుడు యాహ్యా సిన్వర్ ని మట్టుపెట్టింది ఇజ్రాయెల్.
గత ఏడాది అక్టోబర్ లో మొదలుపెట్టిన హమాస్ మీద యుద్ధం ఇప్పటికేయీ కొనసాగుతూనే ఉంది . కానీ సంవత్సరం నుంచె యాహ్యా సిన్వర్ మోస్సాద్ , ఐడిఎఫ్ లకి దొరకకుండా తప్పించుకుంటు వచ్చాడు . గాజాలోని ప్రజలని రక్షణ కవచంగా వాడుకుంటూ తప్పించుకుంటు వచ్చాడు .
నాలుగు నెలల క్రితం గాజాలో ఒక సొరంగంలో యాహ్యా సిన్వర్ ఉన్నాడని సమాచారం అందటంతో ఐడిఎఫ్ దాసి చేయడానికి ప్రయత్నంచగా తనతో ఇజ్రియెల్ పౌరులు బందీలుగా ఉన్నారని భయపెడితే ఐడిఎఫ్ వెనక్కి తగ్గింది .
యాహ్యా సిన్వర్ ఎలా చనిపోయాడు? గత సంవత్సర కాలంగా యాహ్యా సిన్వర్ కోసం విస్తృతంగా గాలిస్తున్న . అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అంటూ ఇంటెలిజెన్స్ వారికి సమాచారం రావడం ఐడి ఎఫ్ దాడి చేయడం తీరా చూస్తే దాడిలో హమాస్ ఫైటర్స్ చనిపోవడం జరిగింది తప్పితే యహ్య సిన్వర్ మాత్రం దొరకలేదు!రెండు దఫాలుగా దొరికినట్లే అనుకున్న సమయాల్లో వేగంగా అక్కడినుండి తప్పించుకోవడం జరిగింది!
ఇంటెలిజెన్స్ ఇన్ పుట్ ని ప్రతిసారీ సీరియస్ గా తీసుకొని దాడి చేస్తూ వస్తున్నది ఐడిఎఫ్
గత గురువారం గాజ దక్షిణ ప్రాంతంలో ఒక ఇంటిలో యహ్య సిన్వర్ ఉన్నట్లుగా ఇంటెల్ రిపోర్ట్ వచ్చింది . అప్పటికే ఆ ప్రాంతంలో IDF ఉంది.
ఇంటెల్ రిపోర్ట్ మరియు లొకేషన్ కోఆర్డినేషన్ సహాయంతో IDF వెంటనే ఆ ఇంటిమీదకి MERKAVA MBT ని ఆ ఇంటిమీద దాడి చేయమని ఆదేశాలు ఇచ్చారు.
మెర్కవ టాంక్ వెంటనే ఫైర్ చేసింది! వెంటనే IDF సైనికులు ఆ ఇంట్లోకి వెళ్లి చూడగా నలుగురు హమాస్ ఫైటర్లు చనిపోయి కనిపించారు కానీ వాళ్లలో యహ్య సిన్వర్ లేడు!
కానీ……
ఆ ప్రదేశానికి దూరంగా ఒక షార్ప్ షూటర్ ( SNIPER ) తన SNIPER గన్ కి ఉన్న స్కోప్ నుండి ఆ ఇంటి వైపే చూస్తున్నాడు!మెర్కవ టాంక్ నుండి షెల్ ఫైర్ అవడం వల్ల ఇంట్లో దుమ్ము రేగడం వల్ల దగ్గరలో ఉన్న IDF సైనికులకి కాసేపు ఏమీ కనపడలేదు కానీ SNIPER కి ఎవరో ఆ ఇంట్లో నుండి తప్పించుకొని పక్కనే ఉన్న ఇంటి రెండో అంతస్తు లోకి పారిపోవడం కనిపించింది!
వెంటనే దగ్గరలోనే ఉన్న IDF కమాండర్ కి సమాచారం ఇచ్చి తన దగ్గర ఉన్న మైక్రో డ్రోన్ ని ఆ ఇంటి రెండో అంతస్తులో కి పంపించాడు!
మైక్రో డ్రోన్ ఎవరో కుర్చీలో కూర్చొని ఉన్నట్లుగా విజువల్స్ చూపించింది. కుర్చీలో కూర్చుని ఉన్నది యహ్య సిన్వర్ కానీ ముఖం డ్రోన్ కెమెరా కి వ్యతిరేక దిశలో ఉండడం డ్రోన్ శబ్దం విని సిన్వర్ కర్ర తీసుకొని డ్రోన్ వైపు చూపించిన తరుణంలో SNIPER వెంటనే అది సిన్వర్ అని నిర్ధారించుకొని ఫైర్ చేశాడు!
బుల్లెట్ సిన్వర్ తలలోంచి దూసుకెళ్లడం తో కుప్పకూలిపోయాడు!
శిధిలాల మధ్య శవం . .
నిజానికి సిన్వర్ తన బాడీ గార్డ్ అయిన Dr. సాలెహ్ – అల్ ఫాఫోవారి ( Saleh al Fafowari ) ని రైఫిల్ కావాలని అడిగితే అతను కర్ర ఇచ్చాడు! ఒక వేళ రైఫిల్ కనుక ఇచ్చిఉంటే సిన్వర్ డ్రోన్ ని కాల్చి అక్కడినుండి తప్పించుకునేవాడే!
IDF ఆ ఇంటి మీదకి మళ్ళీ MBT తో ఫైర్ చేసింది!
ఇల్లు కూలిపోయింది శిదిలాల మధ్యలో యహ్య సిన్వర్ శవం కనపడింది! ఫొటోలో స్పష్టంగా సిన్వర్ తల SNIPER బుల్లెట్ తో ఛిద్రం అయినట్లుగా కనపడింది!
వైద్య పరీక్షలలో అది యహ్య సిన్వర్ అని నిర్ధారించుకున్నాక IDF అధికారికంగా హమాస్ లీడర్ యహ్య సిన్వర్ ని మట్టు పెట్టినట్లు ప్రకటించింది!
హమాస్ నాయకుల సంపద మొత్తం కలిపితే $ 5 బిలియన్ డాలర్లు ఉంటుంది అని అంచనా!
$2 బిలియన్ డాలర్ల అప్పు కోసం పాకిస్థాన్ నానా తంటాలు పడుతన్నది ఆరు నెలల వరకూ విదేశీ మారక ద్రవ్యం సరిపోతుంది అని!
హమాస్ నాయకుల ఆస్థులు అన్నీ ఖాతార్, లెబనాన్, సిరియా దేశాలలో ఉన్నాయి.
యాహ్య సిన్వర్ చనిపోయిన ఇంటి యజమాని ఏమంటున్నాడు అంటే మేము చాలా పుణ్యం చేసుకున్నాము. అబ్రహం యాహ్య సిన్వర్ రూపంలో మా ఇంటికి వచ్చాడు అని.
యాహ్య సిన్వర్ భార్య హ్యాండ్ బ్యాగ్ ధర $ 35,000 డాలర్లు
మరో వైపు గాజా స్ట్రిప్ ప్రపంచంలో అత్యంత పేదరికం లో ఉన్న ప్రదేశాలలో ఒకటిగా ఉంది. ఐక్యరాజ్య సమితి నుండి వచ్చే సహాయం కాకుండా ప్రతీ సంవత్సరం యూరోపియన్ యూనియన్ నుండి 80 మిలియన్ డాలర్లు వస్తాయి గాజా కి. కానీ ఇవేవీ గాజ ప్రజలకి అందువు. హమాస్ నాయకుల జేబుల్లోకి వెళ్ళిపోతాయి!
ఇవి కాక గాజా కి గ్యాస్, మందులు ఉచితంగా ఇజ్రాయేల్ ఇస్తుంది.
ఇరాన్ నిర్వాకం!
లెబనాన్ లోని హెఙబొల్లా, ఎమెన్ లోని హుతి, గాజా లోని అరబ్బులు పేదరికంలో మగ్గుతున్న వారే!
రోజుకి 10 డాలర్ల లెక్కన ఒక్కొక్కరి మీద ఇరాన్ ఖర్చుపెట్టి వీళ్ళని ఉగ్రవాదం వైపు నడిపిస్తున్నది. వీళ్ళు ఇరాన్ డబ్బులకి ఆశ పడి తమ చావుని కొనుక్కుంటున్నారు!
జోర్దాన్ కానీ, ఈజీప్ట్ కానీ వీళ్ళకి సహాయం చేయవు!