Charan Wax Statue: రామ్ చరణ్ విగ్రహమా ? ఎక్కడ ? ఎందుకు ?

అమితాబ్ బచ్చన్ –  షారుక్‌ ఖాన్ సరసన చోటు సంపాదించిన మన చెర్రీ 

  మెగాస్టార్ చిరంజీవి తనయుడు ,   టాలీవుడ్ స్టార్‌ హీరో రామ్‌ చరణ్‌ కి అరుదైన ఘనత  దక్కింది. సినీ రంగానికి   చరణ్​ అందించిన విశేష  సేవలకుగానూ సింగపూర్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌లో చెర్రీ  మైనపు విగ్రహం (wax Statue) ఏర్పాటు చేయనున్నారు .  అబుదాబిలో జరిగిన ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌ ఈవెంట్​లో ఈ విషయాన్ని అధికారిక ప్రకటించారు.                                                                                                  రూపుదిద్దుకొంటోంది : రామ్​ చరణ్‌ మైనపు విగ్రహానికి సంబంధించిన కొలతలను మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియం ప్రతినిధులు రీసెంట్ గా తీసుకున్నారు .   2025 ఏప్రిల్ ,  మే నెలల నాటికి   చరణ్‌ మైనపు  విగ్రహాన్ని సిద్ధం చేసి, సందర్శన కోసం అందుబాటులోకి తీసుకురానున్నట్లు మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియం నిర్వాహకులు   తెలిపారు. మేడమ్ టుస్సాడ్స్‌లో ఉన్న ఐఐఎఫ్‌ఏ జోన్‌లో ఇప్పటికే బాలీవుడ్​ బిగ్​ బీ అమితాబ్ బచ్చన్, బాలీవుడ్  బాద్​ షా గా పేరొందిన  షారుక్‌ ఖాన్, కాజోల్‌, కరణ్‌ జోహార్‌ తదితరులు  మైనపు విగ్రహాలు కొలువుతీరి ఉన్న  సంగతి మనకు  తెలిసిందే.  నిర్వాహకులు రామ్ చరణ్ మైనపు విగ్రహం తయారీ కోసం కొలతలు కూడా తీసుకున్నారు .   ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా గ్లోబల్ స్టార్ స్టేటస్ సాధించిన రామ్ చరణ్ మైనపు విగ్రహం ప్రపంచ ప్రఖ్యాతి  ‘మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియం’లో ఏర్పాటు చేయడంపై చెర్రీ అభిమానులు ,  తెలుగు సినీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు .                                          సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో నాకు  స్థానం లభించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను .     చిన్న వయస్సులో ఉన్నప్పుడు దిగ్గజ వ్యక్తుల మైనపు బొమ్మలను  అక్కడ చూసి ఆనందించాను .   అయితే  ఏదో ఒకరోజు అలాంటి వారి మధ్య తనకు కూడా చోటు దక్కుతుందని మాత్రం   కలలో కూడా ఊహించలేదు . .  సినిమా కోసం తాను పడే తపన, కృషి, అభిరుచికి ఇది గుర్తింపు”  -రామ్ చరణ్