బంగ్లాదేశ్ ఒక విఫల ప్రయోగం! Part 6
డామిట్ కథ అడ్డం తిరిగింది!
మొహమ్మద్ యూనిస్ బంగ్లా కొత్త ప్రధాని!
(రచయిత పొట్లూరి పార్థసారధి): అందరూ గృహ నిర్బంధం నుండి విడుదల చేసి BNP నేత ఖలీదా జియాను ప్రధానిని చేస్తారు అనుకున్నారు కానీ అలా జరగలేదు!
నోబుల్ లారెట్ అమెరికా, బ్రిటన్ ల అనుకూలుడైన మొహమ్మద్ యూనిస్!
మైక్రో ఫైనాన్స్ సిస్టం అయిన గ్రామీన్ బ్యాంక్ ను నెలకొల్పి వెలుగులోకి వచ్చిన మొహమ్మద్ యూనస్ కి తరువాత నోబుల్ ప్రైజ్ ఇచ్చారు! జస్ట్ అమర్త్య సేన్ కి ఇచ్చినట్లు!
అమర్త్య సేన్, మొహమ్మద్ యూనస్ లు ఇద్దరూ బెంగాలీలు!
అమర్త్యసేన్ అమెరికాలో సెటిల్ అయ్యాడు! . మొహమ్మద్ యూనస్ లండన్లో సెటిల్ అయ్యాడు!
UPA 1, UPA -2 సమయంలో అమర్త్యసేన్ భారత్ లో ఉంటూ వచ్చాడు. మోడీ ప్రభుత్వం రాగానే అమెరికాకు వెళ్లిపోరు. ఇందులో మర్మం ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు.
ఇక బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయగానే వెంటనే మొహమ్మద్ యూనస్ లండన్ నుండి ఢాకా లో లాండ్ అయ్యాడు!
అతి మంచివ్యక్తిగా నటించే మొహమ్మద్ యూనస్ పెద్ద ఫ్రాడ్ తెలుసా..
37 మిలియన్ డాలర్లు కుంభకోణంలో ప్రధాన నిందితుడు యూనుస్!
గ్రామీణ బ్యాంక్ లాగానే బంగ్లాదేశ్ లో గ్రామీణ టెలికాం కూడా ఉంది. గ్రామీన్ టెలికాం లో పనిచేసే కాలంలో మనీ లాండరింగ్ కి పాల్పడ్డాడు మొహమ్మద్ యూనస్!
మొహమ్మద్ యూనస్ మీద చీటింగ్, ఫోర్జరీ, మనీ లాండరింగ్ కేసులు నమోదయ్యాయి!
*******
యూనస్ లండన్ లో ఉన్నప్పుడు రోజూ ఖలేదా జియా కొడుకుతో మరియు పాకిస్ధాన్ ISI తో చర్చలు జరిపేవారని ఆరోపణలు ఉన్నాయి.
ఈ ముగ్గురితో జార్జ్ సోరోస్, అతని కొడుకు అలెగ్జాండర్ సారోస్, జో బిడెన్ కొడుకు హంటర్ బిడెన్ టచ్ లో ఉన్నారు!
హిల్లరీక్లింటన్ వెనుక ఉంటూ కథ నడిపింది. అఫ్కోర్స్! డీప్ స్టేట్ అనే మాట వినపడ్డప్పుడల్లా బరాక్ ఒబామా, జార్జ్ సోరోస్, హిల్లరీక్లింటన్ ల పేర్లు బయట పడుతూ ఉంటాయి.
మొత్తం వ్యవహారంలో నిధులు సమకూర్చడం అనేది జార్జ్ సోరోస్ కి చెందిన ఓపెన్ సోర్స్ ఫౌండేషన్ ద్వారా జరిగింది! ఓపెన్ సోర్స్ ఫౌండేషన్ తో మొహమ్మద్ యూనస్ కి చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి!
*******
మొదట బంగ్లాదేశ్ న్యాయ వ్యవస్థని కొనేశారు!
కొత్త విషయం బయటికి వచ్చింది. అదేమిటంటే 2018 లో రిజర్వేషన్ల కోటా సిస్టమ్ ను హసీనా రద్దు చేసింది!
కానీ హఠాత్తుగా ఢాకా హై కోర్టు కోటా సిస్టమ్ ను పునరిద్ధరించింది!
అసలు ఢాకా హై కోర్టు లో ఎవరు ఎప్పుడు పిటిషన్ వేశారో తెలియదు. కానీ ఆఘమేఘాల మీద హై కోర్టు తీర్పు ఇచ్చింది! హై కోర్టు తీర్పు వల్ల మళ్లీ హింస చెలరేగేలా చేశారు!
So! న్యాయవ్యవస్థ ను మానేజ్ చేశాడు జార్జ్ సోరోస్!
*******
డామిట్ కథ అడ్డం తిరిగింది!
షేక్ హసీనా భారత్ రాగానే బ్రిటన్ విదేశాంగ మంత్రి హసీనా కి రాజకీయ శరణార్థి కింద వీసా ఇవ్వాలి అంటే కనీసం నెల రోజుల ముందు అభ్యర్థన చేయాలి అది రూల్ అని అన్నాడు!
మరోవైపు అమెరికా హసీనా కి ఉన్న వీసా అనుమతిని రద్దు చేసింది. ఎందుకంటే హసీనా ప్రధాని కాదు అని!
మరి ప్రజాస్వామ్యం రక్షించ బడిందా?
అసలు ఉద్దేశ్యం ఏమిటంటే…
షేక్ హసీనా ను భారత్ లోనే ఉండేట్లుగా చేసి బంగ్లాదేశ్ ప్రజలలో భారత్ పట్ల ద్వేషం పెంచాలి అని.
కానీ దొంగ ఉద్యమాన్ని ISI హై జాక్ చేసింది!
షేక్ హసీనా రాజీనామా చేసి దేశం వదిలి వెళ్లేవరకూ అమెరికా, బ్రిటన్ లతో బాగానే ఉంది!
హసీనా భారత్ కి వెళ్ళగానే నకిలీ ఉద్యమకారులను తన చెప్పు చేతల్లోకి తీసుకుంది!
ఇప్పుడు వాళ్ళు మొహమ్మద్ యూనస్ ను ప్రధానిగా ఒప్పుకోవడం లేదు. పార్లమెంటు ను రద్దు చేసి ఎన్నికలు జరపాలి అని డిమాండ్ చేస్తున్నారు!
ఎన్నికలు అంటూ జరిపితే మళ్ళీ అవామీ లీగ్ గెలుస్తుంది.
130 లక్షల మంది హిందువుల ఓట్లు అవామి లీగ్ పార్టీ కే పడతాయి!
సాంప్రదాయ బంగ్లా ముస్లిం ఓటర్ల అండ అవామీ లీగ్ కి ఉండనే ఉంది!
అసలు అవామీ లీగ్ కి మొదటి నుండి బంగ్లా హిందువుల ఓట్ బ్యాంక్ స్థిరంగా ఉంటూ వచ్చింది!
అమెరికాలో , బ్రిటన్ లలో షేక్ హసీనా కి మద్దతు రాను రాను పెరుగుతూ వస్తున్నది!
మిగతా ప్రపంచ దేశాలలో కూడా షేక్ హసీనా కి మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలు అంటే అది షేక్ హసీనా కి మళ్ళీ ప్రధాని పదవి కట్టబెట్టడమే!. దీంతో మళ్లీ మల్లగుల్లాలు పడుతున్నాయి అమెరికా, బ్రిటన్.